logo

ఉగ్ర కుట్ర.. హవాలా మార్గంలో డబ్బు అందిందా?: కొనసాగుతున్న విచారణ

నగరంలో ఉగ్ర కుట్ర కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సిట్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జాహెద్‌ రెండు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు.

Published : 04 Oct 2022 15:40 IST

హైదరాబాద్: నగరంలో ఉగ్ర కుట్ర కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సిట్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జాహెద్‌ రెండు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావా దేవీలు కనిపించకపోవడంతో అతడికి హవాలా మార్గంలో డబ్బు అంది ఉండొచ్చనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. జాహెద్‌ సహా అతడు రిక్రూట్‌ చేసుకున్న మరికొందరు సమావేశమైన ప్రాంతాలపై సిట్‌ బృందం ఆరా తీస్తోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దసరా సందర్భంగా హైదరాబాద్‌ పెను విధ్వంసానికి పన్నిన కుట్రపై కేంద్ర నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఛేదించిన సంగతి తెలిసిదే. 

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts