CM Kcr: జాతీయ పార్టీ సిద్ధం.. హైదరాబాద్‌ చేరుకుంటున్న వివిధ రాష్ట్రాల నేతలు

గులాబి పార్టీలో బుధవారం కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉద్యమ పార్టీగా ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా రూపాంతంర చెందబోతోంది. దసరా రోజున మధ్యాహ్నం 1.19 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈమేరకు ప్రకటన చేయనున్నారు.

Published : 04 Oct 2022 20:42 IST

హైదరాబాద్‌: గులాబి పార్టీలో బుధవారం కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉద్యమ పార్టీగా ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా రూపాంతంర చెందబోతోంది. దసరా రోజున మధ్యాహ్నం 1.19 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈమేరకు ప్రకటన చేయనున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత కుమారస్వామి సహా పలువురు ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి హాజరై మద్దతు పలకనున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కుమారస్వామి, మాజీ మంత్రి రేవన్న తదితర జేడీఎస్‌ నేతలకు మంత్రి కేటీఆర్‌, తెరాస నేతలు స్వాగతం పలికారు.

తమిళనాడులో దళిత ఉద్యమ పార్టీగా పేరున్న విడుదలై చిరుత్తయిగల్‌ కచ్చి (వీసీకే) పార్టీకి ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన వీసీకే అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్‌కు ఎమ్మెల్యే బాల్కా సుమన్‌, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి స్వాగతం పలికారు. మరో 3 పార్టీల నేతలు కూడా హాజరయ్యే అవకాశముందని తెరాస నేతలు చెబుతున్నారు. కొన్ని పార్టీలు భారాసలో విలీనమవుతాయని నాయకులు తెలిపారు. పార్టీ ప్రకటన తర్వాత మధ్యాహ్నం 3గంటలకు సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని