logo

రూ.23 కోట్లతో పనుల ప్రారంభం

జిన్‌గుర్తి- తట్టేపల్లి రహదారి పనులు ప్రారంభమయ్యాయి. రూ.23 కోట్లతో చేపట్టిన పనులు నాలుగు నెలల క్రితం నిలిచిపోయాయి. గ‘నిలిచిన రూ.27.70కోట్ల పనులు.. కొనసాగితే మేలు’ శీర్షికన ‘ఈనాడు’లో గత నెల 9న ప్రచురితమైన కథనానికి రహదారులు భవనాల శాఖ డీఈ శ్రీనివాస్‌ స్పందించారు.

Published : 05 Oct 2022 03:10 IST

మొదలైన జిన్‌గుర్తి రహదారి పనులు  

తాండూరుగ్రామీణ: జిన్‌గుర్తి- తట్టేపల్లి రహదారి పనులు ప్రారంభమయ్యాయి. రూ.23 కోట్లతో చేపట్టిన పనులు నాలుగు నెలల క్రితం నిలిచిపోయాయి. గ‘నిలిచిన రూ.27.70కోట్ల పనులు.. కొనసాగితే మేలు’ శీర్షికన ‘ఈనాడు’లో గత నెల 9న ప్రచురితమైన కథనానికి రహదారులు భవనాల శాఖ డీఈ శ్రీనివాస్‌ స్పందించారు. జిన్‌గుర్తి వద్ద ఎర్రమట్టి మొరంపై కంకర పనుల్ని ప్రారంభించారు. నెలాఖరులోగా తారు పనులు చేపట్టి నవంబరులో రెండు వరసల తారు రహదారిని అందుబాటులోకి తెస్తామన్నారు.

ప్రభుత్వ పాఠశాల భవనం ఖాళీ  

తాండూరుగ్రామీణ: జిన్‌గుర్తిలో రూ.అర కోటికిపైగా ఖర్చు చేసి నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రైవేటు గుత్తేదారు ఆక్రమణ నుంచి విద్యాశాఖ అధికారులు ఖాళీ చేయించారు. ‘పాఠశాల భవనం.. ప్రైవేటుకు ధారాదత్తం!’ శీర్షికన ‘ఈనాడు’లో గత నెల 24న ప్రచురితమైన కథనానికి జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవీ స్పందించారు. పాఠశాల భవనం నుంచి ప్రైవేటు గుత్తేదారును ఖాళీ చేయించాలంటూ.. మండల విద్యాధికారి వెంకటయ్యను ఆదేశించారు. దీంతో విద్యాధికారి జిన్‌గుర్తి జడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయుడు మృత్యుంజయస్వామి పాఠశాల భవనం నుంచి గుత్తేదారుకు చెందిన టిప్పర్లు, సామగ్రిని తీయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని