logo

దసరా పండగను ఆనందంగా జరుపుకోవాలి

విజయ దశమిని పురస్కరించుకొని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మంగళవారం రాంనగర్‌లోని నివాసంలో ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండగను ఆనందంగా చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

Published : 05 Oct 2022 03:10 IST

ఆయుధ పూజ చేస్తున్న దత్తాత్రేయ

రాంనగర్‌, న్యూస్‌టుడే: విజయ దశమిని పురస్కరించుకొని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మంగళవారం రాంనగర్‌లోని నివాసంలో ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండగను ఆనందంగా చేసుకోవాలని ప్రజలకు సూచించారు. భద్రతా సిబ్బంది తమ ఆయుధాలను దుర్గామాత చిత్రపటం పక్కన ఉంచి పూజలు చేశారు.


ధార్మిక కార్యక్రమాలకు నిధులివ్వడం అభినందనీయం
హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ


దత్తాత్రేయకు జ్ఞాపిక అందజేస్తున్న ఆలయ నిర్వాహకులు  

పద్మారావునగర్‌, న్యూస్‌టుడే: ముషీరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శృంగేరి జ్ఞాన సరస్వతీ గుడిలోని అమ్మవారి మందిరానికి వెండితాపడాన్ని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మంగళవారం ప్రారంభించారు. నండూరి వెంకటరఘు దీన్ని చేయించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. తన సంపాదనలో ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు వెచ్చించడం అభినందనీయమన్నారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తున్న ధర్మాధికారి కళా జనార్దమూర్తిని అభినందించారు.


6న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ‘అలయ్‌ బలయ్‌’

అబిడ్స్‌, న్యూస్‌టుడే: కుల, మత, ప్రాంత, రాజకీయాలకతీతంగా అందరూ ఒక్కటే అనే భావనను నిర్మించేందుకు ‘అలయ్‌ బలయ్‌’ ఏటా నిర్వహిస్తున్నట్లు హరియాణా గవర్నరు బండారు దత్తాత్రేయ అన్నారు. దసరా సందర్భంగా ఈ ఏడాది కార్యక్రమాన్ని ఈ నెల 6న నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఆయన మాట్లాడుతూ.. అందరూ పాల్గొనాలని కోరారు. భారతీయ సంస్కృతి, తెలంగాణ జానపద కళలు ఉట్టిపడేలా కార్యక్రమాలు, తెలంగాణ వంటలను ఆస్వాదించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని