logo

చదువే పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి: మంత్రి సబిత

‘మన ఊరు-మన బడి’ పథకం ద్వారా రూ.7వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. మంత్రి స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా కౌకుంట్లలో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ సహకారంతో రూ.86 లక్షలు వెచ్చించి

Published : 05 Oct 2022 03:10 IST

ఇంద్రారెడ్డి సమాధి వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి సబితారెడ్డి, ఆమె కుమారులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి,  కల్యాణ్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య

చేవెళ్ల, న్యూస్‌టుడే: ‘మన ఊరు-మన బడి’ పథకం ద్వారా రూ.7వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. మంత్రి స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా కౌకుంట్లలో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ సహకారంతో రూ.86 లక్షలు వెచ్చించి జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంగళవారం ఆమె ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి చదువేనని సూచించారు.

ఇంద్రారెడ్డికి నివాళులు: ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి జయంతిని పురస్కరించుకుని కౌకుంట్లలోని సమాధి వద్ద మంగళవారం మంత్రి సబిత, ఆమె కుమారులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, కల్యాణ్‌రెడ్డి, స్థానిక నేతలు, అభిమానులు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని