logo

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన సంఘటన ముషీరాబాద్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జహంగీర్‌ యాదవ్‌ కథనం ప్రకారం.. ముషీరాబాద్‌ డివిజన్‌ గంగపుత్ర హౌసింగ్‌ సొసైటీ కార్యాలయంలో బాలచందర్‌, అనంత దంపతులు కొన్నేళ్లుగా వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు.

Published : 05 Oct 2022 03:10 IST

రాంనగర్‌, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన సంఘటన ముషీరాబాద్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జహంగీర్‌ యాదవ్‌ కథనం ప్రకారం.. ముషీరాబాద్‌ డివిజన్‌ గంగపుత్ర హౌసింగ్‌ సొసైటీ కార్యాలయంలో బాలచందర్‌, అనంత దంపతులు కొన్నేళ్లుగా వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు(10) ఉన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా వీరు ఉంటున్న సొసైటీ కార్యాలయం పక్కనే జీహెచ్‌ఎంసీ విద్యుత్తు విభాగం ఆధ్వర్యంలో సోమవారం వీధి దీపాలను ఏర్పాటు చేసి పక్కనే ఉన్న ఇనుప కంచెకు అమర్చారు. దీపాలు మంగళవారం మధ్యాహ్నం వరకు వెలుగుతూనే ఉన్నాయి. బాలుడు మధ్యాహ్నం 12.30 గంటలకు స్నేహితులతో నీటి కొలనులో ఆడుకుంటుండగా ఇనుప కంచెకు తగిలి విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. స్థానికులు అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వీధి దీపాలను ఏర్పాటు క్రమంలో తీగలను కలిపిన చోట టేప్‌ సరిగా వేయకపోవడంతో ఇనుప కంచెకు విద్యుత్తు సరఫరా జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని