logo

డేటింగ్‌ యాప్‌తో రూ.1.53 కోట్లు కుచ్చుటోపీ

డేటింగ్‌ యాప్‌ ద్వారా కొందరు అమ్మాయిలతో మాట్లాడించిన ఓ సైబర్‌ నేరగాడు.. నగరానికి చెందిన ఓ వ్యక్తి(64)కి రూ.1.53 కోట్లు కుచ్చుటోపీ పెట్టాడు.  దర్యాప్తు చేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దిల్లీకి చెందిన అరుణ్‌ను అరెస్టు చేశారు.

Published : 05 Oct 2022 03:10 IST

ఈనాడు - హైదరాబాద్‌: డేటింగ్‌ యాప్‌ ద్వారా కొందరు అమ్మాయిలతో మాట్లాడించిన ఓ సైబర్‌ నేరగాడు.. నగరానికి చెందిన ఓ వ్యక్తి(64)కి రూ.1.53 కోట్లు కుచ్చుటోపీ పెట్టాడు.  దర్యాప్తు చేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దిల్లీకి చెందిన అరుణ్‌ను అరెస్టు చేశారు. కేసు వివరాలను నగర సంయుక్త కమిషనర్‌(సీసీఎస్‌) గజరావు భూపాల్‌ మంగళవారం వెల్లడించారు. దిల్లీకి చెందిన్‌ అరుణ్‌ తన స్నేహితులు మోహిత్‌, దీపక్‌, మంజీత్‌, నీతు సోలంకి మరికొందరితో నకిలీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాడు. అందులో కొందరు యువతుల్ని నియమించుకున్నాడు. గిగోలో ప్లేబాయ్‌ సర్వీసెస్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే ఫోన్‌కాల్స్‌ను ఆ యువతులతో మాట్లాడిస్తాడు. పద్మారావునగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. దాని ద్వారా యువతులతో మాట్లాడాడు. వారి మాటలు నమ్మి వివిధ బ్యాంకు ఖాతాలకు రూ.1,53,38,527 పంపించాడు. నిందితుడు అరుణ్‌ తన రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.22 లక్షలు, రూ.8 లక్షల చొప్పున జమ చేయించుకున్నాడు. చివరికి ఇదంతా మోసమని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు దిల్లీలో అరుణ్‌ను అరెస్టు చేశారు. సీసీఎస్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌రావు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని