logo

తెగ వాడేస్తున్నారు!

యాంటిబయోటిక్స్‌ అస్త్రాల్లాంటివి. వాటిని జాగ్రత్తగా వాడితేనే ప్రయోజనం. లేదంటే కొత్త అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో, హైదరాబాద్‌లో యాంటిబయోటిక్స్‌ వాడకం అధికంగా ఉందని తాజాగా ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ తన అధ్యయనంలో బయట పెట్టిన సంగతి తెలిసిందే.

Published : 05 Oct 2022 03:23 IST

నగరంలో యాంటిబయోటిక్స్‌ విచ్చలవిడి వినియోగం

ఈనాడు, హైదరాబాద్‌: యాంటిబయోటిక్స్‌ అస్త్రాల్లాంటివి. వాటిని జాగ్రత్తగా వాడితేనే ప్రయోజనం. లేదంటే కొత్త అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో, హైదరాబాద్‌లో యాంటిబయోటిక్స్‌ వాడకం అధికంగా ఉందని తాజాగా ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ తన అధ్యయనంలో బయట పెట్టిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పారాసెట్మాల్‌, అజిత్రోమైసిన్‌ వినియోగం బాగా పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. నిమ్స్‌ ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే కిడ్నీ, కాలేయ రోగుల్లో 15-20 శాతం మంది దీర్ఘకాలికంగా యాంటిబయోటిక్స్‌, ఇతర మందులు వాడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. వాస్తవానికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు యాంటీబయోటిక్స్‌ అవసరం లేదు. బ్యాక్టీరియా వల్లనే వ్యాధి వచ్చిందని గుర్తించినప్పుడు మాత్రమే వీటిని వాడాలి.

ఓ అంచనా ప్రకారం నగరంలో...

ఇన్‌ఫెక్షన్లలో 90 శాతం వైరల్‌కు చెందినవే..

10 శాతం మాత్రమే బ్యాక్టీరియాకు సంబంధినవి.

యాంటీబయోటిక్స్‌ వాడి ప్రతి 100 మందిలో 25 మంది డయేరియాకు గురవుతున్నారు.

95 శాతం మందుల దుకాణాల్లో చిటీలు లేకుండా ఔషధాలు విక్రయిస్తున్నారు.


రెండువైపులా పదునున్న కత్తులు
  -డా.రమేష్‌, సీనియర్‌ మెడికల్‌ గాస్ట్రో ఎంటరాలజిస్టు, ఉస్మానియా ఆసుపత్రి

యాంటిబయోటిక్స్‌ రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. వైద్యుల సూచనల లేకుండా అసలు వాడకూడదు. ఉస్మానియాకు వస్తున్న కాలేయ రోగుల్లో 20 శాతం మంది దీర్ఘకాలికంగా యాంటిబయోటిక్స్‌ వాడుతున్న వారే. ఏ మందులైనా చివరికి కాలేయానికి చేరతాయి. కొన్ని మందుల్లో ఉన్న హెపిటోటాక్సిక్‌లు కాలేయాన్ని దెబ్బతీస్తాయి. కాలేయ క్యాన్సర్‌ లాంటి తీవ్ర వ్యాధులకు ఇవి కారణమవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని