logo

చిన్నదైనా.. పెద్దదైనా.. లైసెన్స్‌ ఉన్న ఎలక్ట్ట్రీషియన్‌తోనే

 కుందన్‌బాగ్‌లోని అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇటీవల వర్షంలో కరెంట్‌  మరమ్మతులు చేయబోయి విద్యుదాఘాతానికి గురై చŸనిపోయాడు. నిపుణుడు చేయాల్సిన పనిని అపార్ట్‌మెంట్‌ వాసులు చిన్నదే కదా అని చెప్పడంతో చేయబోయి మృత్యువాత పడ్డాడు.

Published : 05 Oct 2022 03:23 IST

ఈనాడు, హైదరాబాద్‌ : కుందన్‌బాగ్‌లోని అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇటీవల వర్షంలో కరెంట్‌  మరమ్మతులు చేయబోయి విద్యుదాఘాతానికి గురై చŸనిపోయాడు. నిపుణుడు చేయాల్సిన పనిని అపార్ట్‌మెంట్‌ వాసులు చిన్నదే కదా అని చెప్పడంతో చేయబోయి మృత్యువాత పడ్డాడు.

సొంత వైద్యం పనికిరాదన్నట్లుగానే.. విద్యుత్తు విషయంలోనూ స్వీయ మరమ్మతులు ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వానాకాలంలో తడి ఉంటే విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఎలక్ట్ట్రీషియన్‌ జాగ్రత్తలు తీసుకుని పనులు చేస్తారు. వాణిజ్య సముదాయాల్లో, బహుళ అంతస్తుల భవనాల్లో లైసెన్స్‌ లేని వ్యక్తులతో కరెంట్‌ మరమ్మతులు చేయించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని  గతంలో సీఈఐజీ గుర్తించి హెచ్చరించింది.
ఛార్జింగ్‌ పాయింట్లతో అప్రమత్తం.. విద్యుత్తు వాహనాల బ్యాటరీలు ఛార్జింగ్‌ చేస్తుండగా పేలి ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్యాటరీలను ఇంట్లో ఛార్జింగ్‌ చేయవద్దని టీఎస్‌ రెడ్కో అధికారులు సూచిస్తున్నారు. ఖాళీ ప్రదేశంలో ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. సెల్లార్లలో అసలే వద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన విద్యుత్తు తనిఖీ అధికారి సూచించారు.

లోపాలు గుర్తించగానే..

వాణిజ్య, కార్యాలయాలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ప్రత్యేకంగా ఎలక్ట్ట్రీషియన్లు అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత ఇళ్లలో, చిన్న అపార్ట్‌మెంట్లలోనే సమస్యలు వస్తున్నాయి. విద్యుత్తు తీగలు వదులు కావడం, కాలిపోవడం వంటివి గుర్తిస్తే.. వారాంతాల్లో మరమ్మతులు చేయించుకోవచ్చు. అత్యవసరమైతే అప్పటికప్పుడు పిలిపించి రిపేర్‌ చేయించుకోవడం మేలు. శాఖాపరమైన సమస్యలైతే 1912, స్థానిక విద్యుత్తు సిబ్బంది, అధికారులకు ఫోన్‌ చేయాలని సూచిస్తున్నారు.ఎక్కువగా పాత ఇళ్లలో సమస్యలు తలెత్తుతుంటాయి. 15 ఏళ్లు దాటగానే వైరింగ్‌ కొత్తది అమర్చుకోవాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని