logo

చిత్ర వార్తలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందించిన స్వచ్ఛసర్వేక్షణ్‌ 2022 పురస్కారాలను ఆయా నగర, పురపాలికల ప్రతినిధులు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా తీసుకున్నారు.

Published : 05 Oct 2022 03:34 IST

చిత్తశుద్ధికి స్వచ్ఛ పురస్కారం

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందించిన స్వచ్ఛసర్వేక్షణ్‌ 2022 పురస్కారాలను ఆయా నగర, పురపాలికల ప్రతినిధులు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా తీసుకున్నారు. మంగళవారం నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌,  సీడీఎంఏ కార్యదర్శి సత్యనారాయణ ఉన్నారు.

పరిశుభ్రత విభాగంలో కేటీఆర్‌, అర్వింద్‌కుమార్‌ నుంచి పురస్కారం అందుకుంటున్న బడంగ్‌పేట  మేయర్‌ పారిజాత, కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి


ఇండియన్‌ స్వచ్ఛ లీగ్‌ పురస్కారంతో పీర్జాదిగూడ నగర మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ కుర్ర శివకుమార్‌గౌడ్‌


పౌరుల ప్రతిస్పందన విభాగంలో అవార్డు స్వీకరిస్తున్న కంటోన్మెంట్‌ బోర్డు జేసీఈవో విజయ్‌కుమార్‌ బాలన్‌నాయర్‌, పారిశుద్ధ్య విభాగాధిపతి దేవేందర్‌


ఇనుముడించిన జీవకళ

నానక్‌రాంగూడ కూడలిలో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ), హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(హెచ్‌జీసీఎల్‌) కార్యాలయం సమీపంలో ఇనుము తుక్కుతో 12 అడుగుల ఎత్తున మానవ విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటిని మంగళవారం సాయంత్రం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ప్రారంభించారు. ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఈ చిత్రానికి ‘కల్లోలం మధ్య ప్రశాంతత జంట శిల్పాలు’ అనే క్యాప్షన్‌ను జోడించారు.


దుర్గంధంలో ప్రతిబింబం

రాష్ట్రంలోని ఎమ్మెల్యేలంతా కొలువుదీరే అసెంబ్లీ ఎదురుగా మురుగు తిష్ఠ వేసింది. మూడు వారాలుగా ముక్కుపుటాలు అదురుతున్నా పట్టించుకునే వారు లేక.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.


చెడుపై యుద్ధం.. దహనానికి సిద్ధం

దసరా ఉత్సవాల్లో రావణ దహనమే కీలకం. పలుచోట్ల ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకోసం నగరంలో పలువురు కళాకారులు పది తలల రావణుడి బొమ్మలను తయారు చేసి సిద్ధంగా ఉంచారు.


మెరిసిన సాగరం..  మురిసిన నగరం

ట్యాంక్‌బండ్‌ పండగ శోభను సంతరించుకొంది. దారి మొత్తాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించడంతో ఆ కాంతులన్నీ  పక్కనే ఉన్న సాగర్‌లో ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంటోంది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts