KCR: కాసేపట్లో జాతీయ పార్టీ ప్రకటన.. తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్‌

తెరాస అధినేత, సీఎం కేసీఆర్ కాసేపట్లో జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇప్పటికే ‘భారత్‌ రాష్ట్ర సమితి’గా పేరు నిర్ణయించిన ఆయన.. మధ్యాహ్నం 1.19 గంటలకు అధికారికంగా వెల్లడించనున్నారు. ఇప్పటికే కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. 

Updated : 05 Oct 2022 12:20 IST

హైదరాబాద్‌: తెరాస అధినేత, సీఎం కేసీఆర్ కాసేపట్లో జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇప్పటికే ‘భారత్‌ రాష్ట్ర సమితి’గా పేరు నిర్ణయించిన ఆయన.. మధ్యాహ్నం 1.19 గంటలకు అధికారికంగా వెల్లడించనున్నారు. ఇప్పటికే కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ నిర్వహించే తెరాస సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పు తీర్మానాన్ని ప్రతిపాదించించి సంబంధిత పత్రాలపై ఆయన సంతకం చేయనున్నారు. తెరాస సర్వసభ్య సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,  జేడీఎస్‌ నేత కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్‌ తదితరులు హాజరు కానున్నారు.

కేసీఆర్ ఆహ్వానం మేరకు జేడీఎస్‌, వీసీకే పార్టీ నేతలు ఉదయమే ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. సీఎం వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం తిన్నారు. జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై కుమారస్వామి తదితరులతో కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. కాసేపట్లో కర్ణాటక, తమిళనాడు నేతలతో కలిసి కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. తెరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు తెలంగాణ భవన్‌ వద్దకు చేరుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కీలక ప్రజాప్రతినిధుల కలిపి మొత్తం 283 మంది సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని