Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. దసరా వేడుకలకు ఆటంకం

దసరా పర్వదినం సందర్భంగా దుర్గామాత మండపాల వద్ద వివిధ కార్యక్రమాలు నిర్వహించే ఔత్సాహికులకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది.

Updated : 02 Nov 2022 11:21 IST

హైదరాబాద్‌: దసరా పర్వదినం సందర్భంగా దుర్గామాత మండపాల వద్ద వివిధ కార్యక్రమాలు నిర్వహించే ఔత్సాహికులకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రావణ దహనం కోసం ఏర్పాటు చేసిన వేదికలు తడిసి ముద్దయ్యాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, దోమలగూడ, కాప్రా, ఏఎస్‌రావు నగర్‌, గౌతమ్‌నగర్‌, కేపీహెచ్‌బీ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి​ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బాగ్‌లింగంపల్లి, బోలక్‌పూర్‌, కవాడిగూడ, జవహర్​నగర్, గాంధీనగర్, రామ్‌నగర్, చంపాపేట్, ఐఎస్​సదన్, సంతోష్​నగర్, సైదాబాద్‌, మలక్‌పేట్, చాదర్‌ఘాట్‌, సరూర్‌నగర్‌  నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని