logo

Hyderabad Rain: రాత్రి ఉరిమింది..నగరమంతా కురిసింది: పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు

రాజధానిలో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. గంట వ్యవధిలో కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలానగర్‌లో 10  సెం.మీ. వర్షపాతం నమోదైంది. పెద్దఅంబర్‌పేట్‌, పేట్‌బషీరాబాద్‌, జీడిమెట్ల ప్రాంతాల్లో దంచికొట్టింది.

Updated : 13 Oct 2022 08:47 IST

జీడిమెట్లలో నీట మునిగిన ద్విచక్ర వాహనాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. గంట వ్యవధిలో కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలానగర్‌లో 10  సెం.మీ. వర్షపాతం నమోదైంది. పెద్దఅంబర్‌పేట్‌, పేట్‌బషీరాబాద్‌, జీడిమెట్ల ప్రాంతాల్లో దంచికొట్టింది. ఫతేనగర్‌ దీన్‌దయాల్‌నగర్‌ కాలనీ రోడ్లు నీళ్లతో నిండిపోయాయి. బాలానగర్‌ ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం చీకటిపడ్డాక ఖైరతాబాద్‌, పంజాగుట్ట అమీర్‌పేట, మైత్రీవనం, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, మెహిదీపట్నం, హిమాయత్‌నగర్‌ ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. కృష్ణానగర్‌ సీ బ్లాక్‌లో జనావాసాలు మరోమారు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. కృష్ణానగర్‌, బోరబండ ప్రాంతాల్లో వరదనీటి ఉద్ధృతికి పలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.


రాత్రి 11 గంటల వరకు నమోదైన వర్షపాతం(సెం.మీ.లలో)
బాలానగర్‌ 10.0
కుత్బుల్లాపూర్‌ 8.7
పటాన్‌చెరు 8.3
తిరుమలగిరి 7.9
కూకట్‌పల్లి 7.4
మూసాపేట 5.6
డబీర్‌పుర, జూబ్లీహిల్స్‌ 3.8
జీడిమెట్ల, సికింద్రాబాద్‌,  
మాదాపూర్‌   3


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని