logo

uppal skywalk: కొత్త ఏడాదిలో ఉప్పల్‌ స్కైవాక్‌

కొత్త ఏడాదిలో ఉప్పల్‌ స్కైవాక్‌ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతమీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉప్పల్‌ జంక్షన్‌లో వాహనాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ స్కైవాక్‌ నిర్మాణానికి హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ తలపెట్టింది.

Updated : 28 Oct 2022 08:36 IST

దాదాపు కొలిక్కి వచ్చిన పనులు

ఉప్పల్‌, న్యూస్‌టుడే: కొత్త ఏడాదిలో ఉప్పల్‌ స్కైవాక్‌ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతమీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉప్పల్‌ జంక్షన్‌లో వాహనాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ స్కైవాక్‌ నిర్మాణానికి హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ తలపెట్టింది. మొత్తం రూ.25 కోట్లు కేటాయించారు. కరోనా కారణంగా రెండేళ్లు పనులకు ఆటంకం ఏర్పడింది. కొంతకాలంగా పనులు ఊపందుకున్నాయి. ఉప్పల్‌, సికింద్రాబాద్‌, ఎల్‌బీనగర్‌, రామంతాపూర్‌ రహదారులు, మెట్రో స్టేషన్‌తో ఈ వంతెనను అనుసంధానించారు. ఈ నిర్మాణంతో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది. నాలుగు వైపుల నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా దారులు ఏర్పాటుచేశారు. ఎక్కడా రోడ్డును దాటే అవసరం లేకుండా స్కైవాక్‌ నుంచి అటు నుంచి ఇటువైపు.. ఇటు నుంచి అటు వైపు ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. మెట్లు ఎక్కలేని వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు, గర్భిణులు స్కైవాక్‌కు చేరుకోవడానికి ఎస్కలేటర్లు, లిఫ్టుల సౌకర్యం కల్పించనున్నారు. ఈ నడక వంతెనతో జంక్షన్‌లో ప్రయాణికుల రద్దీ తగ్గి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి.


* స్కైవాక్‌ పొడవు 640 మీటర్లు
* వెడల్పు  3-4 మీటర్లు, కొన్నిచోట్ల 6 మీటర్లు
* లిఫ్టులు 6 మెట్ల మార్గాలు 12
* ఎస్కలేటర్లు 4
* ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు
రామంతాపూర్‌ రోడ్డు, నాగోలు రోడ్డు, జీహెచ్‌ఎంసీ థీమ్‌ పార్కు,
వరంగల్‌ బస్టాప్‌, ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌, ఎమ్మార్వో ఆఫీస్‌, ఉప్పల్‌ సబ్‌స్టేషన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు