logo

Hyderabad: రౌడీషీట్‌ ఎత్తేసిన ఆనందంలో రేవ్‌ పార్టీ.. 48 మంది అరెస్టు

రౌడీషీట్‌ను ఎత్తేసిన సంతోషంలో ఓ మాజీ రౌడీషీటర్‌ శనివారం రాత్రి తన స్నేహితులకు యువతులతో కలిసి ఏర్పాటు చేసిన రేవ్‌ పార్టీని శంషాబాద్‌ పోలీసులు, స్పెషల్‌ ఆపరేషన్‌ టీం భగ్నం చేసింది.

Updated : 07 Nov 2022 07:47 IST


పోలీసుల అదుపులో ఉన్న రౌడీషీటర్లు, యువత

శంషాబాద్‌, న్యూస్‌టుడే: రౌడీషీట్‌ను ఎత్తేసిన సంతోషంలో ఓ మాజీ రౌడీషీటర్‌ శనివారం రాత్రి తన స్నేహితులకు యువతులతో కలిసి ఏర్పాటు చేసిన రేవ్‌ పార్టీని శంషాబాద్‌ పోలీసులు, స్పెషల్‌ ఆపరేషన్‌ టీం భగ్నం చేసింది. 48 మందిని అరెస్టు చేశారు.

శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శ్రీధర్‌కుమార్‌, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకట్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లికి చెందిన బాబాఖాన్‌ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో రౌడీషీట్‌ను తెరిచారు. ఇటీవల అతనిపై నమోదైన రౌడీషీట్‌ను ఉన్నతాధికారులు తొలగించారు. ఈ సంతోషంలో తన స్నేహితులకు శంషాబాద్‌ రామాంజపూర్‌లోని సలీం వ్యవసాయ క్షేత్రంలో బాబాఖాన్‌ రేవ్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. దీనిపై పోలీసులు దాడి చేశారు. నలుగురు రౌడీషీటర్లు, 44 మంది యువతీ యువకులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి కత్తులు, హుక్కా పరికరాలు, చరవాణులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, స్వాధీనం  చేసుకుని కేసు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని