logo

Hyderabad: వీకెండ్.. నగర శివారుల్లో ప్రశాంతం: రిసార్టులకు తరలుతున్న జనం

వారాంతం వస్తే ఎక్కడికెళ్లాలనేది వారం ఆరంభం నుంచే ప్రణాళికలు రచించుకొని మరీ సందడి చేస్తున్నారు నగర ప్రజలు. గతంలో వారాంతాల్లో సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు కిటకిటలాడేవి.

Updated : 11 Nov 2022 08:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: వారాంతం వస్తే ఎక్కడికెళ్లాలనేది వారం ఆరంభం నుంచే ప్రణాళికలు రచించుకొని మరీ సందడి చేస్తున్నారు నగర ప్రజలు. గతంలో వారాంతాల్లో సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు కిటకిటలాడేవి. ఓ పూట భోజనం బయట తినేసి ఓ సినిమా చూసొస్తే ఆ వారం సుఖాంతం అన్నట్లు భావించేవారు. ఇప్పుడు ట్రెండు మారింది. వారాంతాల్లో కాంక్రీట్‌ జంగిల్‌ నుంచి బయటపడి ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు యత్నిస్తున్నారు. ఇంటిల్లిపాది వ్యవసాయ క్షేత్రాలు, రిసార్టుల్లో గడిపి ఇంటికి చేరుకుంటున్నారు. ఇందుకు నగర శివార్లు వేదికలవుతున్నాయి.

సకల సౌకర్యాలు.. ఎక్కడికెళ్లినా.. అక్కడి సౌకర్యాలను పూర్తిగా పరిశీలించి, అంతకు ముందు వెళ్లి వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఫామ్‌హౌస్‌లలో పెంచిన నాటుకోడి మాంసంతో పాతకాలం వంటలను అక్కడే వండించుకొని ఆస్వాదిస్తున్నారు. గతంలో కిట్టీ పార్టీలు ఇళ్లలోనే జరిగేవి. ప్రస్తుతం ఫామ్‌హౌస్‌లు, రిసార్టులు వేదికలవుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

* నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో 25 రిసార్టులు పర్యాటక శాఖలో నమోదయ్యాయి.

* ఫామ్‌ హౌస్‌లకు లెక్కలేదు. కొంతమంది పర్యాటక శాఖలో నమోదు చేసుకోగా.. మరికొందరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకే పరిమితం చేస్తున్నారు.

* ప్రతి శని, ఆదివారాల్లో ఒక్కో రిసార్టుకు.. కనీసం 1000 మంది వెళ్తున్నారు.

* ఒక్కో ఫామ్‌హౌస్‌కు 20 నుంచి 50 మంది వెళ్తున్నారు.

* నగరంలో 20 సీటర్ల వాహనాలు, మినీ బస్సులు వారాంతాల్లో దొరకడం లేదు.

* కార్తిక మాసం వనభోజనాలూ అక్కడే ఏర్పాటు చేసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని