logo

Shadnagar: అమ్మానాన్నలో ఎవరు కావాలి?.. చిన్నారి జవాబుతో చలించిన జడ్జి

ఒకవైపు అమ్మ.. మరోవైపు నాన్న.. నీకు ఎవరు కావాలంటూ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు.. వారిద్దరూ కావాలని ఆరేళ్ల చిన్నారి తడుముకోకుండా బదులిచ్చింది.

Updated : 13 Nov 2022 10:22 IST

కుమార్తె కోసమైనా ఒక్కటిగా ఉండాలని దంపతులకు విజ్ఞప్తి


న్యాయమూర్తి రాజ్యలక్ష్మి ఒడిలో చిన్నారి

షాద్‌నగర్‌, న్యూస్‌టుడే: ఒకవైపు అమ్మ.. మరోవైపు నాన్న.. నీకు ఎవరు కావాలంటూ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు.. వారిద్దరూ కావాలని ఆరేళ్ల చిన్నారి తడుముకోకుండా బదులిచ్చింది. ఈ జవాబుతో చలించిన న్యాయమూర్తి.. అనంతరం ఆమెను అక్కున చేర్చుకున్నారు. కనీసం పాప భవిష్యత్తు కోసమైనా కలిసుండాలని తల్లిదండ్రులను కోరారు. షాద్‌నగర్‌ పట్టణంలోని కోర్టులో శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌ సందర్భంగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. కల్వకుర్తి పరిధిలోని మాడ్గుల గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమకు విడాకులు కావాలంటూ లోక్‌అదాలత్‌లో భాగంగా న్యాయమూర్తిని ఆశ్రయించారు. ప్రస్తుతం తల్లి వద్ద ఉంటున్న ఆరేళ్ల బాలికతో న్యాయమూర్తి సీఎం రాజ్యలక్ష్మి తొలుత మాట్లాడారు. తనకు తల్లిదండ్రులిద్దరూ కావాలంటూ కంటతడి పెట్టిన చిన్నారిని చూసి ఆమె చలించారు. అనంతరం రాజ్యలక్ష్మి.. భార్యాభర్తలు విడిపోవడం వల్ల పిల్లలు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది వారికి అవగాహన కల్పించారు. కలిసి ఉండాలని కోరడంతోపాటు ఆలోచించుకునేందుకు 15 రోజులగడువు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని