logo

Super star Krishna: నగరాన.. అడుగడుగునా ఆయన స్మృతులే

తన నటనతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సూపర్‌స్టార్‌ కృష్ణకు రవీంద్రభారతితో ప్రత్యేక అనుబంధం ఉంది. పలుమార్లు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.

Updated : 16 Nov 2022 08:01 IST

కృష్ణ, విజయనిర్మలకు వెండి కిరీటం  బహూకరిస్తున్న మధుసూదనాచారి తదితరులు

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: తన నటనతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సూపర్‌స్టార్‌ కృష్ణకు రవీంద్రభారతితో ప్రత్యేక అనుబంధం ఉంది. పలుమార్లు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో కృష్ణ, విజయనిర్మలకు వెండి కిరీటం బహూకరించారు. దాసరి నారాయణరావు స్మారక పురస్కారాన్ని విజయనిర్మలకు అందించినప్పుడు కూడా కృష్ణ వచ్చారు. తన నట జీవిత విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.


పుట్టిన రోజు సంచిక కోసం తెల్లవారుజాము నుంచే... డాక్టర్‌ మల్లికార్జున్‌, విశాంత్ర ఆచార్యులు

అప్పట్లో ఆంధ్రపత్రిక కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక సంచిక వేసేది. సికింద్రాబాద్‌లోని ఆల్ఫా కేఫ్‌ వద్ద సంచిక కోసం తెల్లవారుజాము నుంచే అభిమానులు పడిగాపులు కాసేవారం. సిటీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పత్రికలో వచ్చే పుట్టిన రోజు సంచిక కోసం ఎదురు చూసేవారు.. సినిమాకు ఊరేగింపులు, బాణసంచా కృష్ణ నుంచే మొదలైంది.


‘సూపర్‌స్టార్‌తో అనుబంధం మరువలేనిది’

దిడ్డి రాంబాబు కుమార్తె వివాహ వేడుకలో కృష్ణ

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: సూపర్‌స్టార్‌తో అనుబంధం మరువలేనిదని బర్కత్‌పురాకు చెందిన జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్‌లీడర్‌, తెరాస నేత, కృష్ణ అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు దిడ్డి రాంబాబు తెలిపారు. కృష్ణ మృతి అభిమానులకు తీరని లోటు అన్నారు.2019లో జరిగిన దిడ్డి రాంబాబు కుమార్తె వివాహానికి కృష్ణ హాజరయ్యారు. గృహ ప్రవేశం, సత్యనారాయణస్వామి వ్రతాలకు తమ ఇంటికి కృష్ణ వచ్చారని రాంబాబు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు