logo

Super star Krishna: ‘మళ్లీరా..’ నటశేఖరా..

సినీ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ మరణం అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచింది. విషయం తెలియగానే సినీ నటులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించారు.

Updated : 16 Nov 2022 07:52 IST

తరలొచ్చిన అభిమానం

రాయదుర్గం, గచ్చిబౌలి, న్యూస్‌టుడే

సినీ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ మరణం అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచింది. విషయం తెలియగానే సినీ నటులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించారు. కృష్ణ, మహేశ్‌ అభిమానులు, అభిమాన సంఘం నాయకులు నానక్‌రాంగూడ కాంటినెంటల్‌ ఆసుపత్రికి భారీగా తరలి వచ్చారు. ఉదయం 7 గంటల నుంచే గేటు బయట నిరీక్షించారు. పదకొండున్నర గంటల సమయంలో ప్రాంగణంలోకి అనుమతించారు. పార్థివదేహాన్ని మధ్యాహ్నం నివాసానికి తరలించారు. కృష్ణ అమర్‌ హై అనే నినాదాలు చేస్తూ అభిమానులు అంబులెన్స్‌ వెంట పరుగులు తీశారు. నానక్‌రాంగూడ విజయకృష్ణ టవర్స్‌ కూడలి అభిమానులతో కిటకిటలాడింది. ప్రముఖుల రాకతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని