logo

హైటెక్స్‌లో కొలువుదీరిన పౌల్ట్రీ ఉత్పత్తులు

పౌల్ట్రీ రంగంలో వస్తున్న అత్యాధునిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేసే విధంగా మాదాపూర్‌లోని హైటెక్స్‌ వేదికగా బుధవారం పౌల్ట్రీ ఇండియా-2022 పేరిట భారీ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

Published : 24 Nov 2022 01:51 IST

మాదాపూర్‌, న్యూస్‌టుడే: పౌల్ట్రీ రంగంలో వస్తున్న అత్యాధునిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేసే విధంగా మాదాపూర్‌లోని హైటెక్స్‌ వేదికగా బుధవారం పౌల్ట్రీ ఇండియా-2022 పేరిట భారీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ రంగానికి సంబంధించిన అన్నిరకాల ఉత్పత్తులు ఒకేచోట కొలువుదీరాయి. ఇండియన్‌ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఉత్పత్తి చేసిన అత్యాధునిక పౌల్ట్రీ యంత్రాలు, పరికరాలు ప్రదర్శనకు ఉంచారు. అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ, న్యూజిలాండ్‌ తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగిస్తున్న సరికొత్త పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్స్‌ను ఇక్కడ అందుబాటులో ఉంచారు. కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ప్రదర్శనకు పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. కొన్ని వందల రకాల ఉత్పత్తులను ఇక్కడ స్టాల్స్‌లో ప్రదర్శనకు ఉంచి వాటి పనితీరు గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దాదాపు 370 కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులతో ఏర్పాటైన ఈ ప్రదర్శన.. ఈనెల 25 వరకు కొనసాగనుంది.

ప్రదర్శనకు ఉంచిన యంత్రం

స్టాళ్లను తిలకించేందుకు పేర్ల నమోదు కోసం బారులు తీరిన సందర్శకులు

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని