logo

పర్యావరణహితంగా... మురుగు నిర్వహణ

కాచిగూడ స్టేషన్లో మురుగునీటి శుద్ధి ప్లాంటు (ఎస్టీపీ) ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి రోజు విడుదలయ్యే లక్షల లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవాలని, అందుకోసం ఎస్టీపీని నిర్మించాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశించింది.

Published : 24 Nov 2022 01:50 IST

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో శుద్ధి కేంద్రం నిర్మాణం
న్యూస్‌టుడే, కాచిగూడ

మొదలైన పనులు

కాచిగూడ స్టేషన్లో మురుగునీటి శుద్ధి ప్లాంటు (ఎస్టీపీ) ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి రోజు విడుదలయ్యే లక్షల లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవాలని, అందుకోసం ఎస్టీపీని నిర్మించాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశించింది. ఈ క్రమంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తద్వారా పర్యావరణహితంగా మురుగు నిర్వహణ జరుగుతుందని  చెబుతున్నారు.

పైపులైన్‌ అడ్డంకి..

రైల్వే స్థలంలో చేపట్టిన ఎస్టీపీ నిర్మాణానికి జలమండలి డ్రైనేజీ పైపులైన్‌ అడ్డుగా మారింది. పక్కకు తొలగించాలని రైల్వే అధికారులు కోరగా అందుకు రూ.21 లక్షలు చెల్లించాలని జలమండలి ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ లేఖ రాశారు. రైల్వే స్థలంలో వేసిన జలమండలి పైపులైన్‌ను పక్కకు తొలగించడానికి డబ్బులు ఎందుకు చెల్లించాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కాచిగూడ రైల్వే స్టేషన్‌ డైరెక్టర్‌ ప్రభుచరణ్‌, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను కలిసి జలమండలి అధికారులతో మాట్లాడాలని కోరారు.

ప్రయోజనాలెన్నో..

రైల్వే స్టేషన్‌ భవనం, కార్యాలయాలు, అధికారులు, సిబ్బంది నివాస సముదాయాల (క్వార్టర్లు) నుంచి మురుగు ఉత్పన్నమవుతుంది. ఈ  నీటిని డ్రైనేజీలోకి వదలకుండా ఎస్టీపీలో శుద్ధి చేస్తారు.

ఆ నీటిని రైల్వే ప్లాట్‌ఫారాలు, మూత్రశాలలు, మరుగుదొడ్లను కడగడానికి వినియోగించాలని భావిస్తున్నారు.

స్టేషన్‌ ఆవరణ, పరిసరాల్లోని ఉద్యానవనాలకూ శుద్ధి చేసిన మురికినీటిని వాడేలా ప్రణాళికను రూపొందించారు.

ఈ చర్యలతో భూగర్భ జలాల వినియోగం తగ్గి పర్యావణానికి మేలు జరుగుతుంది.

జలమండలికి నీటి బిల్లు, విద్యుత్‌ సంస్థల చెల్లించాల్సిన బిల్లులు తగ్గి రైల్వేకు డబ్బులు ఆదా అవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని