logo

లాభాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ సర్కిల్‌

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) తెలంగాణ సర్కిల్‌ లాభాల బాట పట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1,234 కోట్ల టర్నోవర్‌ చేయగా, రూ.217 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

Published : 24 Nov 2022 01:50 IST

విజేత ప్రదీప్‌కుమార్‌కు కారు బహూకరిస్తున్న సీజీఎం కె.వి.ఎన్‌.రావు

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) తెలంగాణ సర్కిల్‌ లాభాల బాట పట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1,234 కోట్ల టర్నోవర్‌ చేయగా, రూ.217 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు నాటికి రూ.742 కోట్ల టర్నోవర్‌ జరగ్గా.. రూ.188 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ సర్కిల్‌ సీజీఎం కె.వి.ఎన్‌.రావు వెల్లడించారు. హైదరాబాద్‌ నుంచి 50 శాతం రెవెన్యూ వస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని దూర్‌సంచార్‌ భవన్‌లో బుధవారం ఆయన హర్డీ గేమ్‌ సీజన్‌-1 బంపర్‌ ప్రైజ్‌ విజేతలను ప్రకటించిన అనంతరం విలేకరుల సమావేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ రివైవల్‌ ప్యాకేజీ 2.0 గురించి వివరించారు. రాష్ట్రంలో నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు 4,100 4జీ మొబైల్‌ టవర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి పనిచేసేందుకు అంకుర సంస్థలకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. 50 శాతం రెవెన్యూ మోడల్‌లో టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడర్ల(టిప్‌)కు అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని