logo

హెచ్‌సీయూ ఆచార్యుడికి శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు

ప్రతిష్ఠాత్మక శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డును హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ(హెచ్‌సీయూ) ఆచార్యుడు ప్రొ.సురజిత్‌ ధారాకు ప్రదానం చేశారు.

Published : 24 Nov 2022 01:50 IST

హెచ్‌సీయూ ఉపకులపతి బీజే రావు నుంచి అవార్డు అందుకుంటున్న సురజిత్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డును హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ(హెచ్‌సీయూ) ఆచార్యుడు ప్రొ.సురజిత్‌ ధారాకు ప్రదానం చేశారు. ఏటా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష సేవలందించే శాస్త్రవేత్తలకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి(సీఎస్‌ఐఆర్‌) ఈ గుర్తింపును అందజేస్తోంది. భౌతిక శాస్త్ర విభాగంలో 2020 సంవత్సరానికి సురజిత్‌ ఎంపికయ్యారు. ఏటా ఈ పురస్కారాలను దిల్లీలో ప్రధానమంత్రి హాజరై అందజేస్తుంటారు. రెండేళ్లుగా కరోనా కారణంగా పురస్కారాలను ప్రదానం చేయలేదు. నేరుగా ఆయా విద్యాసంస్థలకే పంపించి విజేతలకు అందించేందుకు సీఎస్‌ఐఆర్‌ నిర్ణయించింది. బుధవారం హెచ్‌సీయూలోని ఫిజిక్స్‌ విభాగంలో ఉపకులపతి ప్రొ.బీజేరావు చేతుల మీదుగా పురస్కారాన్ని సురజిత్‌ అందుకున్నారు. వర్సిటీ భౌతిక శాస్త్ర విభాగం డీన్‌ కె.సి.జేమ్స్‌రాజు, ఆచార్యులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని