logo

Fog: మంచులో జాగ్రత్తగా చలో.. నిపుణుల సూచనలివీ..

చలికాలం.. మంచు కురిసే వేళలో ముందున్న వాహనం కనిపించక రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రవాణారంగ నిపుణులు సూచిస్తున్నారు.

Updated : 25 Nov 2022 08:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: చలికాలం.. మంచు కురిసే వేళలో ముందున్న వాహనం కనిపించక రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రవాణారంగ నిపుణులు సూచిస్తున్నారు. డ్రైవర్లకూ ఆర్టీసీ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.  

* మంచు దట్టంగా కురిసే వేళ ప్రయాణాలు మానుకుంటే మేలు.

* అనివార్యమైతే వైపర్‌ వాడాలి. హైబీమ్‌ లైట్లకు బదులు, లోబీమ్‌ లైట్లు వేస్తే.. రోడ్డు కనిపించడంతోపాటు.. కాంతి దూరం ఎక్కువగా ఉంటుంది.

* ముందు వెళ్లే వాహనాల నుంచి సురక్షిత దూరాన్ని పాటించాలి. అకస్మాత్తుగా బ్రేకు వేసినా పక్కకు వెళ్లడానికి వీలుంటుంది.

* ఇండికేటర్‌ లైట్లను వేసుకొని వెళ్లడం మంచిది. తద్వారా కారు ఉనికిని వాహనదారులు గుర్తించే అవకాశం ఉంటుంది.

* చేతులను ఎప్పుడూ స్టీరింగ్‌ మీదనే ఉంచి, తక్కువ వేగంతో నడపడం ముఖ్యం.

* అద్దాలపై పడే మంచును కరిగించడానికి చాలా కార్ల తయారీ సంస్థలు డీ ఫాగర్‌ను అందిస్తున్నాయి. దీని ద్వారా అద్దం వేడెక్కి మంచు కరిగిపోతుంది. సంగీతం తక్కువ శబ్దంతో వినాలి. వీలైతే ఆఫ్‌ చేయడం ఉత్తమం.

* మద్యం తాగిన వారు మత్తు దిగే వరకు బండిని నడపకూడదు.

* వాహనాన్ని రోడ్డు పక్కన అపేటప్పుడు సిగ్నల్‌ లైటు వేస్తూ.. నెమ్మదిగా ఆపాలి.

* ప్రధాన లైట్లు, సిగ్నల్‌ లైట్లు, లోబీమ్‌ లైట్లు అన్నీ వెలిగే స్థితిలో ఉంచాలి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts