logo

శివారుకు ఎంఎంటీఎస్‌ కూత ఎప్పుడో?

ప్రజారవాణా విషయంలో అటు ఆర్టీసీ, ఇటు మెట్రో దినదినాభివృద్ధి చెందుతున్నా.. ఎంఎంటీఎస్‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. రెండో దశ పూర్తయి అందుబాటులోకి రావడానికి ఆపసోపాలు పడుతోంది.

Published : 25 Nov 2022 02:46 IST

రూ.200 కోట్లు వెచ్చిస్తే రెండో దశ పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజారవాణా విషయంలో అటు ఆర్టీసీ, ఇటు మెట్రో దినదినాభివృద్ధి చెందుతున్నా.. ఎంఎంటీఎస్‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. రెండో దశ పూర్తయి అందుబాటులోకి రావడానికి ఆపసోపాలు పడుతోంది. రూ.816 కోట్ల అంచనాతో ఎంఎంటీఎస్‌ రెండో దశ చేపట్టారు. రైల్వే తన వాటాగా రూ.172 కోట్లు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం రూ. 544 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకూ రూ.130 కోట్లు అందాయి. నిధులు వస్తాయిలే అని రైల్వే పనులు చేసుకుంటూ వెళ్లింది. తన వాటా కంటే అదనంగా రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసి 80 శాతం పనులు పూర్తి చేసింది. కొత్త రైళ్లు కొనడానికి నిధుల్లేవని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని రైల్వే అధికారులు వాపోతున్నారు. మరో రూ.200 కోట్లు వెచ్చిస్తే రెండోదశ పనులు పూర్తవుతాయి. శివారు ప్రాంతాల ప్రజలకు మెరుగైన ప్రజారవాణా అందుబాటులోకి వస్తుంది.

ఇవీ విశేషాలు

ప్రారంభం: 2014  లక్ష్యం: 2019
బడ్జెట్‌: రూ.816 కోట్లు
(రాష్ట్రం వాటా:రూ.544 కోట్లు: రైల్వే: రూ.272 కోట్లు)
95 కి.మీ, 200 సర్వీసులు. 4 లక్షల ప్రయాణికులు లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని