logo

జనాలకు చలానా.. ఠాణాల చెంత ఇలానా?

హైదరాబాద్‌ పరిధిలో ఆపరేషన్‌ రోప్‌.. సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌లతో ట్రాఫిక్‌ పోలీసులు హడలెత్తిస్తున్నారు.

Published : 25 Nov 2022 02:46 IST

సీసీఎస్‌ కార్యాలయం ముందు రహదారిపై..

ఈనాడు, హైదరాబాద్‌, అసిఫ్‌నగర్‌, సనత్‌నగర్‌: హైదరాబాద్‌ పరిధిలో ఆపరేషన్‌ రోప్‌.. సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌లతో ట్రాఫిక్‌ పోలీసులు హడలెత్తిస్తున్నారు. ఫుట్‌పాత్‌లు, రహదారులు ఆక్రమిస్తే నోటీసులు జారీ చేస్తున్న పోలీసులు.. ఠాణాల దగ్గర వాహనాలు ఇష్టానుసారంగా నిలిపి ఉంచడం వల్ల ఇతరులకు ఇబ్బంది ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.

హైదరాబాద్‌ సీసీఎస్‌ కార్యాలయం వద్ద పార్కింగ్‌ కోసం స్థలం కేటాయించినా నిత్యం వచ్చే వందలాది వాహనాలకు సరిపోక.. గీత దాటి రోడ్డుపై నిలిపేస్తున్నారు. పోలీస్‌ కార్లను ఆవల రహదారిపై అడ్డంగా ఆపుతున్నారు.

* నల్లకుంట ఠాణా ఎడమవైపు పక్క గల్లీలో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిపేశారు.

జనాలకు చలానా.. ఠాణాల చెంత ఇలానా?చిక్కడపల్లి ఠాణాలో పార్కింగ్‌కు స్థలం కేటాయించినా.. అదనంగా వచ్చే వాహనాలకు సరిపోవడం లేదు.

జనాలకు చలానా.. ఠాణాల చెంత ఇలానా?సనత్‌నగర్‌ స్టేషన్‌ ముందు రోడ్డు ఆవల ఏళ్లుగా స్వాధీనం చేసుకున్న వాహనాలు నిలిపి ఉన్నాయి.

జనాలకు చలానా.. ఠాణాల చెంత ఇలానా?టోలిచౌకి ట్రాఫిక్‌ ఠాణా ముందు ఫుట్‌పాత్‌ మీదే సిబ్బంది వాహనాలను నిలిపేస్తున్నారు.

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వద్ద నోపార్కింగ్‌లో నిలిపిన పోలీసుల కారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని