logo

ఆలయాల పునరుద్ధరణకు చేయూత ఇవ్వాలి

రాష్ట్రంలోని చారిత్రక, పురాతన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వపరంగా చేయూతను అందించాలని కాచిగూడకు చెందిన అఖిల భారత పురాతన ఆలయాల జీర్ణోద్ధారణ ట్రస్ట్‌ కోరింది.

Published : 25 Nov 2022 02:46 IST

హోంమంత్రి మహమూద్‌ అలీకి వినతిపత్రం ఇస్తున్న జస్మత్‌పటేల్‌, ఆర్‌కే జైన్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని చారిత్రక, పురాతన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వపరంగా చేయూతను అందించాలని కాచిగూడకు చెందిన అఖిల భారత పురాతన ఆలయాల జీర్ణోద్ధారణ ట్రస్ట్‌ కోరింది. అనేక ఆలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో భవిష్యత్తులో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై గురువారం ట్రస్ట్‌ ఛైర్మన్‌ ఆర్‌కే జైన్‌, వైస్‌ ఛైర్మన్‌ జస్మత్‌పటేల్‌, సభ్యుడు రితీశ్‌ జాగిర్దార్‌ తదితరులు రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీని బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వ నిధులను అందజేసే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని అభ్యర్థించారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని