logo

అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించింది. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సునీత బర్ల కథనం ప్రకారం..

Published : 25 Nov 2022 02:46 IST

కాటం రాజు

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించింది. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సునీత బర్ల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని గ్రామానికి చెందిన దుసరి రాజు అలియాస్‌ కాటం రాజు(30) ప్రైవేట్‌ డ్రైవరు. 2016 ఫిబ్రవరి 5న ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి(4)కి పైసల ఆశ చూపి సమీపంలోని పాత భవనంలోకి తీసుకెళ్లాడు. అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మంచాల పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించారు. ఇబ్రహీంపట్నం మేజిస్ట్రేట్‌తో చిన్నారి వాంగ్మూలాన్ని రికార్డు చేయించారు. నిందితుడిపై కోర్టులో పోక్సో చట్టం కింద అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి హరీశ గురువారం తుది తీర్పు వెల్లడించారు. బాధిత చిన్నారికి రూ.5 లక్షల నష్టపరిహారం మంజూరు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సిఫారసు చేస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని