logo

లేబర్‌ కాంట్రాక్టర్‌ హత్య.. దోషికి పదేళ్ల శిక్ష

లేబర్‌ కాంట్రాక్టరును హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల జైలుశిక్ష, రూ.10,000 జరిమానా విధించింది. అదనపు పీపీ కంచర్ల జ్యోతిరెడ్డి కథనం ప్రకారం..

Published : 25 Nov 2022 02:46 IST

ఉమేష్‌ కుమార్‌ సింగ్‌

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: లేబర్‌ కాంట్రాక్టరును హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల జైలుశిక్ష, రూ.10,000 జరిమానా విధించింది. అదనపు పీపీ కంచర్ల జ్యోతిరెడ్డి కథనం ప్రకారం.. ఝార్ఖండ్‌కు చెందిన కార కుమార్‌ సింగ్‌(29) షాద్‌నగర్‌లోని ఫరూక్‌నగర్‌లో ‘సౌత్‌ గ్లాస్‌ కంపెని’లో లేబర్‌ కాంట్రాక్టర్‌గా పనిచేసేవాడు. తన రాష్ట్రం నుంచి కార్మికులను తీసుకొచ్చి సౌత్‌ గ్లాస్‌ కంపెనీలో పని ఇప్పించి వసతి కల్పించాడు. వారి నుంచి నెలకు రూ.2,000 చొప్పున వసూలు చేసి భోజనాలు పెట్టించే వాడు. మెస్‌ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నాడని ఉమేష్‌ కుమార్‌ సింగ్‌(26) కక్ష పెంచుకున్నాడు. 2020 అక్టోబరు 18న కారకుమార్‌ సింగ్‌తో గొడవకు దిగి పదునైన చాకుతో హత్య చేశాడు. షాద్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఉమేష్‌ కుమార్‌సింగ్‌ను రిమాండుకు తరలించి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన జిల్లా పదో అదనపు సెషన్స్‌ కోర్టు ఇంఛార్జి న్యాయమూర్తి హరీశ గురువారం తీర్పునిచ్చారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని