logo

పరిశోధన రంగంలో పరస్పర సహకారం

పరిశోధన రంగంలో సహకరించుకునేందుకు ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీతో ఓయూ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుందని ఉపకులపతి ప్రొ.రవీందర్‌ తెలిపారు.

Published : 25 Nov 2022 02:46 IST

ఒప్పంద పత్రాలతో ప్రొ.రవీందర్‌, ప్రొ.బర్నీ గ్లోవర్‌  

ఉస్మానియా యూనివర్సిటీ: పరిశోధన రంగంలో సహకరించుకునేందుకు ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీతో ఓయూ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుందని ఉపకులపతి ప్రొ.రవీందర్‌ తెలిపారు. ఆ వర్సిటీ వీసీ, ప్రెసిడెంట్‌ ప్రొ.బర్నీ గ్లోవర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రొ.డెబోరా స్వీనీ, వైస్‌ ఛాన్సలర్‌ ప్రొ.లిండా టేలర్‌ గురువారం ఓయూలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు వర్సిటీల అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు.ప్రొ.రవీందర్‌ మాట్లాడుతూ.. ఒప్పందంలో భాగంగా సైబర్‌ సెక్యూరిటీ, సైకాలజీ, హెల్త్‌ సైన్స్‌, జెనెటిక్స్‌ తదితర అంశాల్లో సంయుక్తంగా ప్రసంగాలు, పరిశోధనలు, ఆన్‌లైన్‌ కోర్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అధ్యాపకుల, విద్యార్థుల మార్పిడికి అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొ.లక్ష్మినారాయణ, ఎంవోయూ కమిటీ ఛైర్మన్‌ ప్రొ.జి.బి.రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని