logo

క్రీడల్లో రాణించేందుకు శిక్షణ

విద్యార్థినుల్లోని ప్రతిభకు, నైపుణ్యానికి సానబెడితే పోటీల్లో అత్యుత్తమ విజయాన్ని సొంతం చేసుకుంటారు. అందుకు తగిన శిక్షణ అవసరం.

Published : 25 Nov 2022 03:03 IST

ముగింపు దశలో ‘బాలికల గురుకుల’ శిబిరం


విద్యార్థులతో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రమణమ్మ

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి న్యూస్‌టుడే: విద్యార్థినుల్లోని ప్రతిభకు, నైపుణ్యానికి సానబెడితే పోటీల్లో అత్యుత్తమ విజయాన్ని సొంతం చేసుకుంటారు. అందుకు తగిన శిక్షణ అవసరం. ఇదే ఉద్దేశంతో వికారాబాద్‌ సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో క్రీడా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈనెల 9న ప్రారంభం కాగా 26న ముగియనుంది. గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 12 పాఠశాలలు, కళాశాల విద్యార్థినులకు అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఔత్సాహిక క్రీడాకారులను ఆయా విభాగాల్లో మెరికల్లా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. వారితో సాధన చేయిస్తున్నారు.

ఏటా ప్రతిభ వెలికితీత: ప్రతి ఏటా విద్యార్థినులకు క్రీడా పోటీలు నిర్వహించి ప్రతిభను వెలికితీస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలకు వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసి వికారాబాద్‌లో శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 52 మంది విద్యార్థులు పాల్గొని శిక్షణ పొందుతున్నారు.

* మెదక్‌, తాండూర్‌, హసన్‌పర్తి, నిర్మల్‌, బోధన్‌, సిద్దిపేట, వైరా, రామన్నపేట, బాలానగర్‌, బోరబండ, తాటిపల్లి నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.

* లాంగ్‌ జంప్‌, రన్నింగ్‌, హై జంప్‌, చెస్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌త్రో క్రీడలు నేర్పుతున్నారు. శిక్షకులు కళావతి, సురేశ్‌ విద్యార్థులకు ప్రత్యేక తరహాలో ఉదయం 5 నుంచి 9.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.

* పాఠశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రమణమ్మ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 28న భద్రాచలంలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు శిక్షణ పొందిన క్రీడాకారులను పంపిస్తామని తెలిపారు. అక్కడ అన్ని సొసైటీలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు.

జాతీయ స్థాయికి రుక్మిణి: స్థానిక సంఘం లక్ష్మీబాయి గురుకుల కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న రుక్మిణి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి ఎంపికైంది. ఖోఖో క్రీడలో ఆమె ప్రతిభ కనబరచటంతో కరీంనగర్‌లో జరిగిన పోటీల్లో ఆమెను ఎంపిక చేశారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఈ పోటీలు జరుగుతాయని రమణమ్మ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts