logo

Hyderabad: శిల్పా ఫ్లైఓవర్‌.. నేటి నుంచే రయ్‌రయ్‌

ఐటీ కారిడార్‌ను బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్‌)తో అనుసంధానం చేస్తూ నిర్మించిన శిల్పా లేఅవుట్‌ మొదటి దశ పైవంతెన ప్రారంభానికి సిద్ధమైంది.

Updated : 25 Nov 2022 08:17 IST

ఈనాడు, హైదరాబాద్‌,  న్యూస్‌టుడే, మాదాపూర్‌: ఐటీ కారిడార్‌ను బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్‌)తో అనుసంధానం చేస్తూ నిర్మించిన శిల్పా లేఅవుట్‌ మొదటి దశ పైవంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఐకియా మాల్‌ వెనక మొదలయ్యే ఈ పై వంతెన 30 అంతస్తుల ఎత్తైన భవనాల మధ్య నుంచి సాగిపోతూ విశాలమైన ఓఆర్‌ఆర్‌పైకి చేరుతుంది. బహుళ అంతస్తుల మధ్య వంపులు తిరుగుతూ.. రెండు అంతస్తుల్లో రూపుదిద్దుకున్న ఈ వంతెనకు అనేక ప్రత్యేకతలున్నాయని, ఆకాశం నుంచి చూస్తే శిల్పంలా కనిపిస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇనార్బిట్‌ మాల్‌, రహేజా మైండ్‌స్పేస్‌ కూడలి, బయో డైవర్సిటీ కూడలి మధ్య సుమారు 1.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణమవుతోన్న హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సెంటర్‌(హెచ్‌కేసీ) దృష్ట్యా రూపొందించిన ప్రాజెక్టుల్లో శిల్పా లేఅవుట్‌ పైవంతెన మూడో ప్రాజెక్టు. డిసెంబరు నెలాఖరులో కొండాపూర్‌ కూడలి పైవంతెన అందుబాటులోకి రానుంది. ఓఆర్‌ఆర్‌ నుంచి గచ్చిబౌలి పైవంతెన మీదుగా బొటానికల్‌ గార్డెన్‌ రోడ్డుపైకి నిర్మిస్తున్న శిల్పా లేఅవుట్‌ రెండోదశ ప్రాజెక్టు డిసెంబరు 2023 నాటికి పూర్తవుతుందని అంచనా. శిల్పా లేఅవుట్‌ మొదటి దశ పై వంతెనను శుక్రవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది.

నిర్మాణ వ్యయం: రూ.250 కోట్లు
పొడవు: 956 మీటర్లు
వెడల్పు: 16 మీటర్లు (నాలుగు వరసలు)

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts