logo

తెరుచుకోనున్న పెద్దగోల్కొండ అవుటర్‌ జంక్షన్‌

శంషాబాద్‌ మండల పరిధి పెద్దగోల్కొండ అవుటర్‌ జంక్షన్‌ వరద ముంపునకు కారణమైన నరసింహ చెరువు తూములు ఎట్టకేలకు తెరచుకున్నాయి.

Published : 25 Nov 2022 03:03 IST

చెరువు తూములను తెరుస్తున్న అధికారులు, చిత్రంలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ మండల పరిధి పెద్దగోల్కొండ అవుటర్‌ జంక్షన్‌ వరద ముంపునకు కారణమైన నరసింహ చెరువు తూములు ఎట్టకేలకు తెరచుకున్నాయి. మూతబడిన అవుటర్‌ జంక్షన్‌ సమస్యను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌తో కలిసి మంత్రి సబితారెడ్డి ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించారు. మంత్రి ఆదేశాలతో ఇరిగేషన్‌ అధికారులు తూములను తెరవడానికి మూడురోజుల క్రితమే యత్నించగా చిన్నగోల్కొండ రైతులు, స్థానికులు అడ్డుకున్నారు. గురువారం చిన్నగోల్కొండ సర్పంచి పద్మావతిరెడ్డి, చిన్నగోల్కొండ పీఏసీఎస్‌ డైరెక్టర్‌ అనంతరెడ్డ్డి సమక్షంలో స్థానిక రైతులతో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ మాట్లాడి ఒప్పించారు. నీటి పారుదలశాఖ డీఈ జగదీష్‌ పర్యవేక్షణలో నరసింహ చెరువు తూములను సాయంత్రం తెరిచారు. పెద్దగోల్కొండ అవుటర్‌ జంక్షన్‌పై వాహనాల రాకపోకలను శుక్రవారం నుంచి అనుమతించనున్నట్లు డీఈ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని