logo

ప్రభుత్వ వైద్యంలో పెనుమార్పులు

ప్రభుత్వ వైద్యసేవల్లో పెనుమార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

Published : 27 Nov 2022 03:17 IST

స్కానింగ్‌ యంత్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి తలసాని. చిత్రంలో సూపరింటెండెంట్‌ రాజారావు

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైద్యసేవల్లో పెనుమార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గాంధీ ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగంలో ఏర్పాటుచేసిన రెండు టిఫా స్కానింగ్‌ యంత్రాలను మంత్రి తలసాని శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టిఫా స్కానింగ్‌తో గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ స్కానింగ్‌ కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.5వేలు వసూలు చేస్తారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా నిర్వహిస్తామన్నారు. రూ.20కోట్లతో 56 టిఫా స్కానింగ్‌ యంత్రాలు కొనుగోలు చేసి ఈ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో ప్రారంభించినట్లు వివరించారు. ఆరోగ్యశాఖ మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వాసుపత్రుల్లో అనేక నూతన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ ఎం.రాజారావు, కార్పొరేటర్‌ హేమలత, ఆర్‌ఎంఓ-1 జయకృష్ణ, శ్రీహరి, శాంతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని