logo

విద్యార్థి మెట్రో కాంబి టికెట్‌ ధర తగ్గింపు

 బస్సుల్లో మెట్రో కాంబి టికెట్‌ ధరను ఆర్టీసీ సగానికి తగ్గించింది. రూ.20గా ఉన్న స్టూడెంట్‌ మెట్రో కాంబి టికెట్‌ను రూ.10కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Published : 27 Nov 2022 03:17 IST

ఈనాడు, హైదరాబాద్‌, చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే:  బస్సుల్లో మెట్రో కాంబి టికెట్‌ ధరను ఆర్టీసీ సగానికి తగ్గించింది. రూ.20గా ఉన్న స్టూడెంట్‌ మెట్రో కాంబి టికెట్‌ను రూ.10కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల పాస్‌లను ఆర్డినరీ బస్సుల్లోనే అనుమతిస్తారు. ఒకవేళ మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణించాలంటే కాంబినేషన్‌ టికెట్‌ తీసుకోవాలి. గతంలో పది రూపాయలుగా ఉన్నప్పుడు ఎక్కువ మంది వినియోగించుకునేవారు. రూ.20కి పెంచిన తర్వాత విద్యార్థులకు భారంగా మారింది. కాంబి ధర తగ్గించాలని ఎంతోకాలంగా కోరుతున్నారు. పరిశీలించిన అధికారులు రూ.10 తగ్గిస్తూ తక్షణం అమల్లోకి తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని