logo

రైతులపై అక్రమ కేసులు ఎత్తేయాల్సిందే

పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం, రైతు రుణ విముక్తి చట్టం తేవాలని, విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించాలని ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన రైతు ఉద్యమంలో 80వేల మందిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ప్రజాసంఘాల నాయకులు శనివారం రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించారు.

Published : 27 Nov 2022 03:34 IST

రాజ్‌భవన్‌ ముట్టడికి  యత్నం.. అరెస్టు

ఖైరతాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద నినాదాలు చేస్తున్న నాయకులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం, రైతు రుణ విముక్తి చట్టం తేవాలని, విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించాలని ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన రైతు ఉద్యమంలో 80వేల మందిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ప్రజాసంఘాల నాయకులు శనివారం రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించారు. ఖైరతాబాద్‌లోని రైల్వే స్టేషన్‌ నుంచి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా  పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికులకు రూ.5వేల పెన్షన్‌ ఇవ్వాలని, లఖింపూర్‌లో ఐదుగురి హత్యకు కారకులైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కొడుకు అశిష్‌ మిశ్రాను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అరెస్టు చేసిన రైతు గిరిజన నాయకులను వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించి ఆ తర్వాత విడుదల చేశారు. అరెస్టైన వారిలో ప్రజా సంఘాల నాయకులు పశ్యపద్మ, సాగర్‌ వేములపల్లి, వెంకట్రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య,  యాదగిరిరావు, చంద్రశేఖర ప్రసాద్‌, మట్టయ్య, రమావత్‌ అంజయ్య నాయక్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని