logo

పనిమనిషి స్థల వివాదంపై స్పందించిన మంత్రి

ఓ ఇంట్లో పనిమనిషికి సంబంధించిన కొద్దిపాటి స్థలం వివాదంలో ఉందని తన దృష్టికి రావడంతో వెంటనే స్పందించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు.. పరిష్కారానికి ఆదేశాలివ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 27 Nov 2022 04:29 IST

పరిష్కరించాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌కు హరీశ్‌రావు ఆదేశాలు

చార్మినార్‌, న్యూస్‌టుడే: ఓ ఇంట్లో పనిమనిషికి సంబంధించిన కొద్దిపాటి స్థలం వివాదంలో ఉందని తన దృష్టికి రావడంతో వెంటనే స్పందించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు.. పరిష్కారానికి ఆదేశాలివ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం మంత్రి టి.హరీశ్‌రావు జూమ్‌ సమావేశం ద్వారా పేట్లబుర్జు ఆస్పత్రిలో టిఫా స్కాన్‌ మిషన్లను ప్రారంభించి.. అనంతరం ఇక్కడి కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్‌అలీ, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ శ్వేతామహంతితోపాటు వైద్యులు, పేషెంట్లతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రితో మాట్లాడిన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.పి.మాలతి ‘మీరు ఆస్పత్రికి వస్తారని భావించి,  మా ఇంటి పనిమనిషి తనకు సంబంధించిన 20 గజాల స్థలంపై వివాదాలు ఉన్నాయని, పరిష్కారం కోసం మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నన్ను కోరారు. దీంతో ఆరోగ్యశాఖ మంత్రికి స్థలాల సమస్యలు ఎలా చెబుతామని సర్ది చెప్పాను’’ అన్నారు. దీనికి స్పందించిన మంత్రి ఆ స్థలం  వివరాలు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ శ్వేతామహంతికి ఇవ్వండి, ఆమె తప్పకుండా పరిష్కరిస్తారని సూచించారు. ఇలా మంత్రి ఓ పనిమనిషి స్థలం వివాదం పరిష్కారానికి సైతం చొరవ చూపడంతో  మంత్రులు అధికారులు, వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పేట్లబుర్జులోని ఇరువురు పేషెంట్లు సోనిబేగం, రాజ్యలక్ష్మిలతో సైతం మంత్రి మాట్లాడుతూ డైట్‌ ఎలా ఉంది.. వైద్యసేవలు బాగున్నాయా అని వాకాబు చేశారు. దీనికి వారు బాగున్నాయని సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని