logo

ఉత్సాహంగా వైశ్యా లైమ్‌ లైట్‌ అవార్డుల ప్రదానోత్సవం

వివిధ రంగాల్లో ఉత్తమంగా రాణిస్తున్న ఆర్యవైశ్య వర్గానికి చెందిన మహిళలకు వైశ్యా లైమ్‌ లైట్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఉమన్‌ పేరుతో పురస్కారాలను రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం రాత్రి ప్రదానం చేశారు. 21 విభాగాల్లో అవార్డులు అందజేశారు

Published : 27 Nov 2022 03:34 IST

ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా నుంచి పురస్కారం  అందుకుంటున్న జీహెచ్‌ఎంసీ జాయింట్‌ కమిషనర్‌ ఉమా ప్రసాద్‌ ఘంటసాల

రాయదుర్గం, న్యూస్‌టుడే: వివిధ రంగాల్లో ఉత్తమంగా రాణిస్తున్న ఆర్యవైశ్య వర్గానికి చెందిన మహిళలకు వైశ్యా లైమ్‌ లైట్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఉమన్‌ పేరుతో పురస్కారాలను రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం రాత్రి ప్రదానం చేశారు. 21 విభాగాల్లో అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక, ఫ్యాషన్‌ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 58 దేశాల్లో కాస్మెటిక్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్న పద్మజ మానెపల్లి, కూలెక్స్‌ ఉత్పత్తుల వ్యాపారంలో రాణిస్తున్న పాలకుర్తి భ్రమరాంబ, జీహెచ్‌ఎంసీ జాయింట్‌ కమిషనర్‌ ఉమాప్రసాద్‌ ఘంటసాల, శ్మశాన వాటికలను సుందరీకరించే స్రవంతి, ప్రముఖ స్టైలిస్ట్‌ చంద్రిక రామ్స్‌, సూపర్‌ కిడ్‌ చైత్రపతి, న్యాయవాది శ్రావ్య కట్ట తదితరులు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త, ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్‌, రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ బోర్డు ఛైర్మన్‌ దామోదర్‌, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ లైమ్‌లైట్‌ అవార్డుల వ్యవస్థాపకుడు శివ కుమార్‌ ఇమాడి, మానెపల్లి జువెల్లర్స్‌ ఛైర్మన్‌ మానెపల్లి రామారావు, డైరెక్టర్స్‌ గోపీకృష్ణ, మురళీ కృష్ణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని