logo

క్రియేటివ్‌ మల్టీమీడియాకు టీటా ఎడ్యుకేషన్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

ప్రముఖ డిజిటల్‌ మీడియా విద్యా సంస్థ క్రియేటివ్‌ మల్టీమీడియా అకాడమీ.. టీటా (తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌) ఎడ్యుకేషన్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డును సాధించింది.

Published : 27 Nov 2022 03:34 IST

సందీప్‌ మఖ్తల నుంచి అవార్డు అందుకుంటున్న రాజశేఖర్‌ బుగ్గవీటి

రాయదుర్గం: ప్రముఖ డిజిటల్‌ మీడియా విద్యా సంస్థ క్రియేటివ్‌ మల్టీమీడియా అకాడమీ.. టీటా (తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌) ఎడ్యుకేషన్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డును సాధించింది. రాయదుర్గం టీ హబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీటా అధ్యక్షుడు సందీప్‌ మఖ్తల చేతుల మీదుగా సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ రాజశేఖర్‌ బుగ్గవీటి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ.. 1998లో ప్రారంభించిన తమ సంస్థలో శిక్షణ పొందిన 27 వేలమంది యువత ఉద్యోగావకాశాలు పొందారని తెలిపారు. డిజిటల్‌ మీడియాలో యువతను ప్రోత్సహించేందుకు ఎగ్జిస్టింగ్‌ కెరీర్స్‌ ఇన్‌ డిజిటల్‌ మీడియా అనే పుస్తకాన్ని సంస్థ ప్రచురించిందని అన్నారు. డిజిటల్‌ రంగంలో డిమాండ్‌ ఉన్న యానిమేషన్‌, విఎఫ్‌ఎక్స్‌, గేమింగ్‌, యూఐ, యూవీ డిజైన్‌, గ్రాఫిక్స్‌లో కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు. షార్ట్‌, మీడియం, లాంగ్‌ టర్మ్‌తోపాటు సర్టిఫికెట్‌ కోర్సులు, డిప్లొమా, డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్స్‌లో బోధన చేపడుతామన్నారు. సంస్థ రెండుసార్లు బెస్ట్‌ డిజిటల్‌ మీడియా అకాడమీ ఇన్‌ ఇండియా అవార్డులు సొంతం చేసుకుందని, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, నామినేషన్స్‌ గెలుచుకుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు