logo

డ్రోన్లతో విప్లవాత్మక మార్పు..!

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ఒక విప్లవాత్మకమైన మార్పు అని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సుధారాణి తెలిపారు.

Published : 27 Nov 2022 03:34 IST

కంది పైరుపై మందును పిచికారీ చేస్తున్న డ్రోన్‌

తాండూరు, న్యూస్‌టుడే: వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ఒక విప్లవాత్మకమైన మార్పు అని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సుధారాణి తెలిపారు. తాండూరులోని కొడంగల్‌ రోడ్డు వారగా డ్రోన్‌తో కంది పంటపై మందులను పిచికారీ చేసే విషయంలో రైతులకు నిర్వహించిన అవగాహన, క్షేత్ర ప్రదర్శనకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రోన్‌ ద్వారా ఒకే రోజు 25 నుంచి 30 ఎకరాల్లో మందులను సునాయాసంగా పిచికారీ చేయవచ్చన్నారు. ఏ పంటకు డ్రోన్‌ను ఎంత ఎత్తు నుంచి  పిచికారీ చేయవచ్చు, ఎలాంటి సందర్భాల్లో వినియోగించ వచ్చు, డ్రోన్‌ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. రైతులు అద్దె ప్రాతిపదికన డ్రోన్‌ను వినియోగిస్తే పంట పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.500 నుంచి రూ.600 చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. అనంతరం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మారుట్‌ ఏజెన్సీ నిర్వాహకులతో డ్రోన్‌తో మందులను ఎలా పిచికారీ చేస్తారనే విషయంలో ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్‌ సుధాకర్‌, సుజాత, రాజేశ్వర్‌రెడ్డి, యమున, తాండూరు డివిజన్‌ వ్యవసాయ శాఖ ఏడీ రుద్రమూర్తి, మండల వ్యవసాయ అధికారిణి రజిత రైతులు పాల్గొన్నారు.



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని