రెండో దశపై ఆశ
హైదరాబాద్ మహానగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ) మొదటి దశలో చేపట్టిన నిర్మాణాల వల్ల చాలా జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించింది.
రూ.1,935 కోట్లతో ఎస్ఆర్డీపీ పనులకు ప్రణాళిక
పూర్తయితే నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: హైదరాబాద్ మహానగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ) మొదటి దశలో చేపట్టిన నిర్మాణాల వల్ల చాలా జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించింది. ఈ ప్రాజెక్టు కింద రెండో విడత పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఎస్ఆర్డీపీ రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపితే అనేక జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇందుకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అధికారులు ప్రణాళిక రూపొందించారు.
ప్రభుత్వమిచ్చేనా.. మళ్లీ రుణమేనా?
ఎల్బీనగర్ జంక్షన్లో దాదాపు రూ.600 కోట్లతో పైవంతెనలు, అండర్ పాస్‌లు నిర్మించడంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించింది. టోలిచౌకిలో మొదటి ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. తర్వాత దుర్గం చెరువు వంతెన నుంచి మొదలైతే షేక్‌పేట పైవంతెన, శిల్పాలేఅవుట్ పైవంతెన.. అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలో కూడా రాకపోకలు సుగమమయ్యాయి. ఇవన్నీ ఎస్ఆర్డీపీ మొదటి దశ పనులే. సోమేష్‌కుమార్ బల్దియా కమిషనర్‌గా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి ఆయన రూపొందించిన ప్రాజెక్టే ఎస్ఆర్డీపీ. మరో ఏడెనిమిది నెలల్లో దాదాపు మొదటి దశ కింద చేపట్టిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. రెండో దశ కింద కూడా దాదాపు రూ.1,935 కోట్లతో కీలకమైన వంతెనలు ఇతరత్రా నిర్మాణాలను చేపట్టడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీన్ని ఆమోదించాలని మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చారు. మొదటి దశ ప్రాజెక్టు వ్యయం మొత్తం వివిధ బ్యాంకుల నుంచి బల్దియా రుణం కింద తీసుకున్నదే. రెండో దశ పనులకు రుణం కింద కాకుండా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోందని కొత్తగా తీసుకునే రుణాలను భరించే స్థితిలో బల్దియా లేదని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రుణం కింద ఈ నిధులను సేకరించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/01/2023)
-
India News
Aero India Show: ఏరో ఇండియా షో.. నాన్‌వెజ్ అమ్మకాలపై నిషేధం.. ఎందుకో?
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
India News
Boycott Culture: ‘బాయ్‌కాట్’ మంచి పద్ధతి కాదు..!: కేంద్ర మంత్రి ఠాకూర్
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
India News
Goa: ఆస్తి వివాదం.. గోవాలో ఫ్రెంచ్ నటి నిర్బంధం..!