logo

ప్రమాదానికి ఎదురెళ్లొద్దు

త్వరగా గమ్యం చేరాలనే ఆత్రుత. ముందుకెళ్లి యూటర్న్‌ తీసుకోవాలంటే సమయం వృథా అవుతుందనే ఆలోచన.

Updated : 28 Nov 2022 02:55 IST

నగరంలో 50 హాట్‌స్పాట్ల గుర్తింపు

అపసవ్య ప్రయాణంతో ఆరుగురి దుర్మరణం

ఈనాడు, హైదరాబాద్‌

త్వరగా గమ్యం చేరాలనే ఆత్రుత. ముందుకెళ్లి యూటర్న్‌ తీసుకోవాలంటే సమయం వృథా అవుతుందనే ఆలోచన. పోలీసులు గమనించరనే ధైర్యంతో కొందరు అపసవ్య దిశలో వాహనాలకు ఎదురెళ్లి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. గడిచిన 10 నెలల వ్యవధిలో ఇలా ప్రయాణించి ఆరుగురు మృత్యువాత పడడం, 100 మందికిపైగా గాయపడడంతో నగర ట్రాఫిక్‌ పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మృతుల్లో ఇద్దరు మైనర్లుండడం గమనార్హం.


ప్రమాదాల నివారణకు ఏంచేస్తున్నారు

వారం రోజులపాటు నగర ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఎ.వి.రంగనాథ్‌, డీసీపీలు ప్రకాశ్‌రెడ్డి, కరుణాకర్‌, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లు నగరవ్యాప్తంగా పలు ప్రాంతాలను పరిశీలించారు.

140 చోట్ల అడ్డదారిలో రాకపోకలు సాగిస్తుండగా, వాటిలో 104 ప్రమాదభరిత ప్రాంతాలుగా గుర్తించారు.  

ప్రమాదకర ప్రాంతాల్లో 50 యూటర్న్‌లకు 1-2 కి.మీ. దూరంలో ఉండటం గమనార్హం.

ఈ నెల 21 నుంచి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం నుంచి స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టి కేసులు నమోదు చేయనున్నారు. ఆ 50 ప్రదేశాలపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నారు.


ప్రజల ప్రాణాలు కాపాడేందుక

రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ అత్యంత ప్రమాదకరం. నగరంలో యూటర్న్‌ల వద్ద అడ్డదారిలో వచ్చే ద్విచక్ర వాహనదారులతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సమయం వృథా అనుకోకుండా నిబంధనలు పాటిస్తే సజావుగా గమ్యం చేరుకోవచ్చనే విషయమై అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనల ప్రకారమే చలానాలు విధిస్తున్నాం.

ఎ.వి.రంగనాథ్‌, నగర ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని