logo

సింగపూర్‌ సదస్సుతో రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి

రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టిటా) సంయుక్తంగా సింగపూర్‌లో నిర్వహించనున్న వరల్డ్‌ తెలంగాణ ఐటీ సదస్సు (డబ్ల్యూటీఐటీసీ) లోగోను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదివారం టీ హబ్‌లో ఆవిష్కరించారు.

Published : 28 Nov 2022 02:04 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టిటా) సంయుక్తంగా సింగపూర్‌లో నిర్వహించనున్న వరల్డ్‌ తెలంగాణ ఐటీ సదస్సు (డబ్ల్యూటీఐటీసీ) లోగోను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదివారం టీ హబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సదస్సు నిర్వహణ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే ఈ సదస్సులో సాంకేతిక రంగానికి చెందిన ఔత్సాహికులు పాల్గొనాలన్నారు. టిటా అధ్యక్షుడు సందీప్‌ కుమార్‌ మఖ్తల మాట్లాడుతూ.. టిటా దశాబ్ది వేడుకల్లో భాగంగా వచ్చే ఏప్రిల్‌లో సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ఐటీ నిపుణలు, ఆవిష్కర్తలు, పరిశోధకులతో సింగపూర్‌ వేదికగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో టెక్నాలజీ ఎక్చేంజ్‌ జరుగుతుందని, అగ్రిటెక్‌, ఫిన్‌టెక్‌, ఎడ్యుటెక్‌, హెల్త్‌టెక్‌, వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. టిటా రాష్ట్ర కార్యదర్శి వినయ్‌, సభ్యులు శ్రీనివాస్‌, శ్రావణి బాసరాజు, క్రాంతి, వైద్యనాథ్‌ పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని