logo

పంచ వర్ష మెట్రో

నగర ప్రజారవాణా జీవనాడిగా మారిన మెట్రో గత ఐదేళ్లలో 35 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానం చేర్చింది. 12 లక్షల ట్రిప్పులను నడిపింది.

Published : 28 Nov 2022 02:04 IST

12 లక్షల ట్రి¨ప్పులు.. 35 కోట్ల ప్రయాణికులు

ఈనాడు, హైదరాబాద్‌: నగర ప్రజారవాణా జీవనాడిగా మారిన మెట్రో గత ఐదేళ్లలో 35 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానం చేర్చింది. 12 లక్షల ట్రిప్పులను నడిపింది. సోమవారంతో హైదరాబాద్‌ మెట్రో ప్రారంభమై ఐదేళ్లు పూర్తవుతుంది. 2017 నవంబరు 28న ప్రధాని మోదీ మియాపూర్‌ స్టేషన్‌ వద్ద మెట్రో ప్రారంభించారు. తొలుత మియాపూర్‌- అమీర్‌పేట- నాగోల్‌ కారిడార్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రధాని ప్రారంభించిన మరుసటి రోజు నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం సగటున రోజుకు 4.10 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.

హైదరాబాద్‌ మెట్రో తొలి దశను 72 కి.మీ. ప్రతిపాదించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టారు. ఆస్తుల సేకరణ, విద్యుత్తు, తాగునీటి పైపుల పనులు, రహదారుల విస్తరణకు అయ్యే రూ.3 వేల కోట్లు వ్యయం ప్రభుత్వం భరించగా, మెట్రో కట్టేందుకు ఎల్‌ అండ్‌ టీ మెట్రో రూ.13 వేల కోట్లకుపైగా వ్యయం చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు వ్యయం రూ.1,458 కోట్లకు గాను.. రూ.1,200 కోట్లు మంజూరు చేసింది. మూడు కారిడార్లలో 69.2 కి.మీ. మెట్రో మార్గం 57 స్టేషన్లు దశలవారీగా అందుబాటులోకి వచ్చింది.  లాక్‌ డౌన్‌ సమయంలో మినహా నిత్యం ప్రయాణికులకు సేవలందించింది.


 

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని