శబరిమల దర్శనం.. ప్రత్యేక రైళ్లతో సులభం
కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. కాచిగూడతోపాటు సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ల నుంచి ఈ రైళ్లు వెళ్లనున్నాయి.
డిసెంబరు 5 నుంచి అందుబాటులోకి
కాచిగూడ, న్యూస్‌టుడే: కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. కాచిగూడతోపాటు సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ల నుంచి ఈ రైళ్లు వెళ్లనున్నాయి. కాచిగూడ-కొల్లం మధ్య నడుపనున్న ప్రత్యేక రైళ్లలో అధికంగా బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి.
నెల పాటు.. కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లను డిసెంబరు 5 నుంచి జనవరి 9 వరకు నడుపనున్నారు. ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు అర్ధరాత్రి 11.50 గంటలకు కొల్లం చేరుకుంటుంది. నగరం నుంచి వెళ్లే భక్తులు చెంగనూర్ స్టేషన్లో దిగి శబరిమలకు వెళతారు. ఈరైలు సాయంత్రం 4.39 గంటలకు షాద్‌నగర్ చేరుకుంటుంది. ఈ రైలు కొల్లం స్టేషన్ నుంచి తిరిగి కాచిగూడకు డిసెంబరు 7, 14, 21, 28, జనవరిలో 4, 11 తేదీల్లో బయలుదేరుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kotamreddy: కాసేపట్లో మళ్లీ మీడియా ముందుకు కోటంరెడ్డి
-
Crime News
కారులో మంటలు.. గర్భిణి, భర్త సజీవదహనం
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
12 మంది భార్యలు.. సెంచరీ దాటిన పిల్లలు!
-
Politics News
మాజీ మంత్రి ముత్తంశెట్టికి చుక్కెదురు.. రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన