నిప్పు తప్పిద్దామిలా ముప్పు
అనూహ్యంగా జరిగేవే అగ్ని ప్రమాదాలు. విద్యుదాఘాతమైనా.. గ్యాస్ లీకైనా.. భయపడకండి... ఫైరింజన్‌కు ఫోన్ చేసే లోపే మనకు అందుబాటులో ఉన్న నీళ్లు, నురగతో మంటలను అదుపు చేసేందుకు అవకాశాలున్నాయి.’
విద్యాసంస్థల్లో అగ్నిమాపక శాఖ మాక్‌డ్రిల్
గ్యాస్ సిలిండర్ మంట ఎలా ఆర్పాలో చూపిస్తున్న అధికారి
ఈనాడు, హైదరాబాద్: ‘అనూహ్యంగా జరిగేవే అగ్ని ప్రమాదాలు. విద్యుదాఘాతమైనా.. గ్యాస్ లీకైనా.. భయపడకండి... ఫైరింజన్‌కు ఫోన్ చేసే లోపే మనకు అందుబాటులో ఉన్న నీళ్లు, నురగతో మంటలను అదుపు చేసేందుకు అవకాశాలున్నాయి.’ అంటూ అగ్నిమాపకశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్లు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘మాక్‌డ్రిల్’ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ప్రమాదాల నియంత్రణను వివరిస్తే... వారుంటున్న పరిసరాల్లో అగ్నిప్రమాదాలు జరిగితే రక్షణ చర్యల్లో వారు కీలకంగా వ్యవహరించనున్నారనే భావనతో ఈ కార్యక్రమం చేపట్టారు.
విద్యుత్తు వినియోగం జాగ్రత్తలు...
ప్రతి ఇంట్లోనూ విద్యుత్తు వినియోగం పెరిగింది. సెల్‌ఫోన్ ఛార్జర్లు, పవర్ బ్యాంక్‌లు, టీవీలు, డిష్‌లు, ఇస్త్రీ పెట్టెలు ఇలా ఇంటి నిండా స్విచ్ఛులే.. సామర్థ్యానికి మించి విద్యుత్తును ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కడైతే స్విచ్ఛులు ఎక్కువగా ఉన్నాయో.. అక్కడ దృష్టి పెట్టాలి. స్విచ్ఛుల వెనక వైర్లు కాలిపోయినా, ఇన్సులిన్ తగ్గినా వెంటనే ప్రభావం కనిపిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
సిలిండర్లు పేలవు..
* నగరం, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాల్లో తరచూ వినిపించేమాట గ్యాస్ సిలిండర్ పేలుడు. వాస్తవానికి గ్యాస్ సిలిండర్ పేలిపోదని అగ్నిమాపకశాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జీడిమెట్ల, సికింద్రాబాద్‌లోని ఇళ్లలో భారీ శబ్ధంతో పేలుళ్లు జరిగాయి కదా.. అని విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు అధికారులు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. సిలిండర్లోని గ్యాస్ లీక్ అవుతూ గదిలో నిండిపోయినప్పుడు ఇంట్లో అగ్ని వెలిగించడం, కరెంట్ స్విచ్ఛ్‌లు వేయడం వల్ల ఉత్పన్నమయ్యే స్పార్క్(సూక్ష్మ నిప్పురవ్వ) ద్వారా ఒక్కసారిగా మంట చెలరేగుతుంది. ద్వారాలు లేకపోవడంతో గోడలు, వస్తువులను ధ్వంసం చేస్తుంది. అని తెలిపారు.
* సిలిండర్ నుంచి గ్యాస్ లీకైనప్పుడు.. స్టవ్ వెలిగించగానే.. ఎక్కడి వరకు గ్యాస్ వ్యాపించిందో.. అక్కడి వరకు మంట వేగంగా వ్యాప్తి చెందుతుంది. దాంతో సహజంగానే సిలిండర్ పేలిందని అనుకుంటాం. మంటలు తక్కువగా ఉన్నప్పుడు మన వద్ద ఉన్న నీళ్లు, నురగతో ఆర్పేయొచ్చు.
* రాత్రి వేళ గ్యాస్ లీకేజీ అవకాశాలు లేకుండా రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ముఖ్యంగా సిలిండర్ ఉన్న వంట గదిలో రిఫ్రిజిరేటర్ ఉంచకూడదు. ఫ్రిడ్జ్ ఉంటే.. దాన్ని మనం 24 గంటలూ ఆన్‌లో ఉంచుతాం. వోల్టేజీ హెచ్చు తగ్గులప్పుడు, స్విచ్ఛుల వద్ద చిన్న స్పార్క్ వచ్చినా గ్యాస్ లీకేజీ కారణంగా మంట పెద్దగా మారుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/01/2023)
-
India News
Aero India Show: ఏరో ఇండియా షో.. నాన్‌వెజ్ అమ్మకాలపై నిషేధం.. ఎందుకో?
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
India News
Boycott Culture: ‘బాయ్‌కాట్’ మంచి పద్ధతి కాదు..!: కేంద్ర మంత్రి ఠాకూర్
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
India News
Goa: ఆస్తి వివాదం.. గోవాలో ఫ్రెంచ్ నటి నిర్బంధం..!