అతివేగం తీసింది ప్రాణం
ద్విచక్రవాహనం రోడ్డు విభాగినిని ఢీకొట్టి యువకుడు దుర్మరణం చెందిన ఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో ఆదివారం జరిగింది.
విభాగినిని ఢీకొట్టి యువకుడి దుర్మరణం
కాప్రా, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం రోడ్డు విభాగినిని ఢీకొట్టి యువకుడు దుర్మరణం చెందిన ఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్సై బి.వేణుమాధవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏఎస్‌రావునగర్ డివిజన్ జమ్మిగడ్డ మారుతీనగర్వాసి దంతులూరి గోపాలకృష్ణ స్థానికంగా టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. పెద్ద కొడుకు ప్రసాద్‌రాజ్ ఇంటర్ వరకు చదివి.. తండ్రికి చేదోడుగా ఉంటున్నారు. చిన్నకుమారుడు అభిసాయి రామ్రాజ్(22) గచ్చిబౌలిలో ఐఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్ ఈ ఏడాదే పూర్తిచేశాడు. అమెరికాకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాడు. చిన్ననాటి స్నేహితుడు సిద్దిపేట జిల్లా పెదమాకుపల్లికి చెందిన రమేష్ శనివారం అభిసాయి రామ్రాజ్ దగ్గరకు వచ్చారు. అదే రాత్రి నాగారంలోఉన్న మరో మిత్రుని వద్దకు వెళ్లారు. ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై నాగారం నుంచి ఏఎస్‌రావునగర్ వైపు బయలు దేరారు. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కమలానగర్ బస్టాప్ వద్ద ప్రధాన రహదారిపై మలుపు తిరిగే క్రమంలో వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం విభాగినిని ఢీకొట్టింది. వాహనాన్ని నడుపుతున్న అభిసాయి రామ్రాజ్ ఘటనా స్థలంలో మృతి చెందారు. మృతదేహాన్ని గాంధీకి తరలించారు. వెనుక కూర్చున్న రమేష్‌కు గాయాలయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Samantha: సమంతా.. నువ్వు ఫీల్ అవుతావని ఆ పోస్ట్ పెట్టలేదు: నందినిరెడ్డి
-
Sports News
IND vs NZ: అతడి గురించి పెద్దగా చెప్పకపోవడం ఆశ్చర్యమేసింది: సంజయ్ మంజ్రేకర్
-
World News
Elon Musk: ‘మిస్టర్ ట్వీట్’గా పేరు మార్చుకున్న మస్క్.. యూజర్లలో అయోమయం..!
-
India News
Republic Day: నారీ శక్తి, స్వదేశీ గన్లు, అగ్నివీరులు.. తొలి ప్రత్యేకతలెన్నో..!
-
Crime News
Telangana News: మరికొన్ని గంటల్లో పెళ్లి.. గుండెపోటుతో వరుడి మృతి
-
Movies News
Republic Day: మన మాతృభూమి కలకాలం సుభిక్షంగా ఉండాలి.. రిపబ్లిక్ డే విషెస్ చెప్పిన స్టార్స్