ఎంఎన్జేలో మహిళా రోగులకు ప్రత్యేక విభాగం
ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి ఎంఎన్జేలో మహిళా రోగుల కోసం ప్రత్యేకించి ఓ విభాగం రూపుదిద్దుకుంటోంది. కొత్త భవనం పనులు కొలిక్కి రావడంతో వచ్చేనెల నుంచి అందుబాటులోకి రానుంది.
వచ్చేనెల నుంచి అందుబాటులోకి
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి ఎంఎన్జేలో మహిళా రోగుల కోసం ప్రత్యేకించి ఓ విభాగం రూపుదిద్దుకుంటోంది. కొత్త భవనం పనులు కొలిక్కి రావడంతో వచ్చేనెల నుంచి అందుబాటులోకి రానుంది. 6 అంతస్తులకు రూ.40 కోట్లు వెచ్చిస్తున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఓ ఫార్మా కంపెనీ అదనపు భవన నిర్మాణాన్ని చేపడుతోంది. ఇందులో ప్రత్యేకంగా మహిళల కోసం ఒక అంతస్తు కేటాయించనున్నారు. మహిళల్లో గతంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు (సర్విక్స్) ఎక్కువగా ఉంటే వాటిని దాటేసి రొమ్ము క్యాన్సర్లు ఎక్కువగా నమోవవుతున్నాయి. ఎంఎన్‌జే ఆసుపత్రికి వచ్చే మహిళ రోగుల్లో 25-30 శాతం రొమ్ము క్యాన్సర్లే ఉంటున్నాయి. మరో 20 శాతం సర్విక్స్, మిగతా ఆరేడు శాతం ఇతర క్యాన్సర్లు బయట పడుతున్నాయి. చాలామంది వ్యాధి ముదిరిన తర్వాత వైద్యులను సంప్రదిస్తున్నారు. ఫలితంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళల కోసం ఎంఎన్జేలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు. నిర్భయంగా తమ సమస్యలను చెప్పుకొనేందుకు మహిళలు సైతం ముందుకొస్తారని పేర్కొంటున్నారు.
ఇవీ ఉపయోగాలు..
* ప్రస్తుతం ఎంఎన్‌జేకు నిత్యం ఆరేడు వందల మంది ఓపీ సేవల కోసం వస్తుంటారు. అందరితోపాటు మహిళలు ఓపీ ఇతర చికిత్సలకు ఎదురు చూడాల్సి వస్తోంది. అవగాహన లేక మరికొందరు చికిత్స తీసుకోకుండా వెనుతిరుగుతున్నారు.
* ప్రత్యేక విభాగంతో ఈ సమస్య తీరనుంది. ఓపీ నుంచి పరీక్షలు, చికిత్సల వరకు ఇక్కడే ఏర్పాట్లు చేయనున్నారు. ఒక ఫ్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్లు, నలుగురు అసోసియేట్లు, మరో ఆరేడుగురు పీజీ వైద్యులతో ఒకయూనిట్ సిద్ధం చేస్తున్నారు.
* మహిళా వైద్యులు ఎక్కువ మంది ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. దీంతో ప్రతి మహిళ సిగ్గుపడకుండా సమస్యను చెప్పే వీలుంటుంది. టెస్టుల కోసం మహిళలు పలు అంతస్తులు తిరగాల్సి వస్తోంది. ఇకనుంచి పరీక్షలన్నీ ఒకేచోట చేయనున్నారు.
* కొత్త భవనంలో 300 పడకలుంటాయి. ఇందులో 150 పిల్లలకు, 150 పెద్దలకు. 20 చొప్పున ప్రత్యేక ఐసీయూలు అందుబాటులోకి రానున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!