‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసు’ ఇప్పట్లో లేనట్లే
జేఎన్టీయూ పరిధిలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్‌లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సరికొత్త కోర్సులెన్నో అందుబాటులోకి వచ్చినా ఆ మేరకు బోధన సిబ్బంది అందుబాటులో లేరు.
ఈనాడు, హైదరాబాద్: జేఎన్టీయూ పరిధిలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్‌లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సరికొత్త కోర్సులెన్నో అందుబాటులోకి వచ్చినా ఆ మేరకు బోధన సిబ్బంది అందుబాటులో లేరు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసు(పీవోపీ) కింద ఐటీ, పరిశ్రమ నిపుణులను తీసుకోవాలని యూజీసీ సూచిస్తోంది. యూజీసీ ఇచ్చిన వెసులుబాటు మేరకు ఆయా రంగాల్లోని ఐటీ, పరిశ్రమల నిపుణులను నియమించుకోవాలని జేఎన్టీయూ భావించింది. ఇలా తీసుకునే బోధన సిబ్బందికి పీహెచ్డీ ఉండనక్కర్లేదు. మూడేళ్ల కాలానికి నియమించుకోవచ్చు. వారానికి రెండు తరగతులు బోధించొచ్చు. ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. వేతనాలు వర్సిటీ తరఫునే చెల్లించాలి. మరోవైపు వర్సిటీలలో బోధన సిబ్బంది ఖాళీల భర్తీకి సంబంధించిన దస్త్రం గవర్నర్ వద్ద పెండింగులో ఉంది. వీటన్నింటినీ దృష్ట్యా పీవోపీ పోస్టులు ఈ విద్యా సంవత్సరానికి సాధ్యపడదని జేఎన్టీయూ అభిప్రాయపడుతోంది. అవసరమైతే ప్రైవేటు కళాశాలల్లో అనుమతించాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ప్రభుత్వం వర్సిటీలలో చేపట్టనున్న బోధన సిబ్బంది నియామకాల ప్రక్రియ పూర్తయ్యాకే సబ్జెక్టు నిపుణులు ఏ మేరకు అవసరమో గుర్తించి నిర్ణయం తీసుకుంటాం’’ అని జేఎన్టీయూ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
OTT Movies: ఈవారం ఓటీటీలో వచ్చే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు
-
Politics News
Nara Lokesh - Yuvagalam: తెదేపాలో యువోత్సాహం.. లోకేశ్ పాదయాత్ర సాగేదిలా..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Padma Shri: రూ.20తో పేదలకు వైద్యం..ఎందరికో ఆదర్శప్రాయం
-
General News
Telangana News: తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు: తమిళి సై
-
India News
Covid Vaccine: భారత్ బయోటెక్ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్’ విడుదల