logo

గుంటకండ్ల పిచ్చిరెడ్డి మృతి తీరని లోటు

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఉమ్మడి నల్గొండ జిల్లా కమ్యూనిస్ట్‌ నేత గుంటకండ్ల పిచ్చిరెడ్డి(98) మృతి సీపీఐకి తీరనిలోటని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 28 Nov 2022 02:02 IST

పిచ్చిరెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించి నినదిస్తున్న చాడ తదితరులు

నాచారం, న్యూస్‌టుడే: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఉమ్మడి నల్గొండ జిల్లా కమ్యూనిస్ట్‌ నేత గుంటకండ్ల పిచ్చిరెడ్డి(98) మృతి సీపీఐకి తీరనిలోటని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పిచ్చిరెడ్డి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆదివారం నాచారం హెచ్‌ఎంటీనగర్‌లోని నివాసంలో ఆయన భౌతికకాయానికి చాడతో పాటు మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్‌రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, ప్రజాపక్షం ఎడిటర్‌ శ్రీనివాసరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్‌రావు, సీపీఐ నేత కరుణకుమారి, పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, సీపీఐ నేతలు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు